అంద‌రూ జ‌గ‌న్ వెంటే.. అస‌త్య ప్ర‌చారానికి చెక్

-

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిపోయాక కీలక‌ నేత‌లంద‌రూ మొహం చాటేస్తున్నార‌నే ప్ర‌చారానికి చెక్ పెట్టేస్తున్నారు ఆ పార్టీ నేత‌లు. ఇప్పుడిప్పేడే వైసీపీ నేతలు యాక్టివ్ అవుతున్నారు. వారిపై వచ్చిన ఊహాగానాలు తప్పు అని క్లారిటీ ఇచ్చేస్తున్నారు.వై నాట్ 175 అన్న నినాదంతో ఎన్నికల బరిలో దిగిన వైసీపీకి కేవలం 11 స్థానాలు దక్కాయి.చాలామంది సీనియర్లు సైతం ఓడిపోయారు.ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా అన్నిచోట్ల వైసిపికి ఓటమి ఎదురైంది.

దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపించింది.అదే సమయంలో చాలామంది పార్టీ నేతలు గుడ్ బై చెప్పారు. ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతున్నారు. ఇంకోవైపు వైసీపీ హయాంలో యాక్టివ్ గా పని చేసిన నేతలు సైతం పక్క చూపులు చూస్తున్నట్లు ప్రచారం జరిగింది.సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ కి పరిమితమయ్యారని..మాజీ మంత్రి రోజా వైసీపీని వీడుతారని.. తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్లిపోతారని పెద్ద ఎత్తున టాక్ నడిచింది. కానీ అదంతా ఉత్త ప్రచారమేనని తేలిపోయింది.

చిత్తూరు జిల్లా నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశం కాగా మాజీమంత్రి రోజా కూడా హాజరయ్యారు. గతంలో ఎప్పుడు కనిపించని కొత్త లుక్‌లో రోజా ఈ సమావేశానికి హాజరు కావడం విశేషం. ఓటమి ఎదురైన తర్వాత రోజా పెద్దగా కనిపించడం మానేశారు. ఒక‌టి రెండు సార్లు క‌నిపించినా యాక్టివ్‌గా లేరు. అదే సమయంలో తరచూ తమిళనాడులో దర్శనమిచ్చేవారు. అక్కడ సీఎం స్టాలిన్ ను కలిసేవారు. దీంతో ఆమె డిఎంకెలో చేరతారని ప్రచారం సాగింది. సోషల్ మీడియాలో సైతం వైసిపి ఆనవాళ్లను తొలగించేశారని టాక్ నడిచింది. మరోవైపు విజయ్ దళపతి కొత్త పార్టీలో రోజా చేరతారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.

కానీ చిత్తూరు జిల్లా నేతల సమావేశానికి హాజరై ఈ ప్రచారానికి చెక్ చెప్పారు రోజా. ఇక పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. వైసీపీ అధికార ప్రతినిధిగా, సీఎం ముఖ్య సలహాదారుగా వ్యవహరించారు సజ్జల. వైసిపి దారుణ పరాజయానికి సజ్జల కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సజ్జలకు కేసుల భయం వెంటాడుతోందని.. ఆయన విదేశాలకు వెళ్లిపోయినట్లు ప్రచారం సాగింది. కానీ వాటన్నింటికీ చెక్ చెబుతూ సజ్జల జగన్ వెంట కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరిగి ఆయన పార్టీలో యాక్టివ్ అవుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

మాజీమంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి,ఎంపీ మిథున్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతున్న‌ట్లు క‌థ‌నాలు వ‌చ్చాయి.వారు కూడా చిత్తూరు జిల్లా నేత‌ల స‌మావేశానికి హాజ‌రుకావ‌డంతో అనుమానాలు తొల‌గిపోయాయి.ఇంకా చాలా మంది సీనియ‌ర్‌లు వైసీపీని వీడుతున్నారంటూ వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 100 రోజులు అవుతోంది.

వైసీపీ నేతలు ఇప్పుడిప్పుడే ఓటమి బాధ నుంచి బయటపడుతున్నారు. రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. పరామర్శల పేరిట వైసీపీ శ్రేణులను కలుస్తున్నారు. అదే సమయంలో గతంలో యాక్టివ్ గా పని చేసిన కీలక నేతలు సైతం జగన్ వెంట కనిపించడం ప్రారంభించారు. దీంతో గత 100 రోజులుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది.అస‌త్య ప్ర‌చారాల‌ను తొల‌గించ‌డం కోసం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు.దీంతో సీనియ‌ర్‌లు అంద‌రూ మ‌ళ్ళీ యాక్టివ్ అవుతార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version