ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్స్.. సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ఆలోచన

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ఆలోచన చేశారు. ట్రాఫిక్ స్ట్రీమ్ లైవ్ చేయడంలో ట్రాన్స్ జెండర్స్ ను వాలంటీర్స్ గా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హోమ్ గార్డు తరహాలో వారికి ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఆసక్తి ఉన్నవారి వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి.

ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్ పాత్ ల అభివృద్ధి, పారిశుధ్యం, ఇతర పనుల్లో పురోగతి పై సీఎం అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. టెండర్లు దక్కించుకున్న వారు పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లను ఉపేక్షించవద్దని.. ఎట్టి పరిస్థితుల్లో గడువు లోగా పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి పూర్తి స్థాయి రిపోర్టు 15 రోజుల్లో అందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తప్పుడు రిపోర్టులు ఇస్తే.. అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version