తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి నామినేషన్ వేసిన పోచారం

-

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క.. పోచారం పేరును ప్రతిపాదించారు. దీంతో పోచారం నామినేషన్ దాఖలు చేశారు. సీఎం కేసీఆర్ విప్తి మేరకు బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు స్పీకర్ ఎన్నికకు మద్దతు పలికాయి. దీంతో స్పీకర్ ఎన్నిక లాంఛనం కానుంది. రేపు అధికారంగా తెలంగాణ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరును ప్రకటించనున్నారు.

పోచారం రాజకీయ ప్రస్థానం సాగిందిలా..

* పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అందరికన్నా సీనియర్ రాజకీయ నాయకుడు.
* 1976 లో పోచారం రాజకీయాల్లోకి వచ్చారు.
* బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు పోటీ చేశారు.. ఆరుసార్లు విజయం సాధించారు.
* 1977లో దేశాయిపేట సింగిల్‌విండో చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
* 1987లో డీసీసీబీ చైర్మన్‌గా ఎంపికయ్యారు.
* 1994లో బాన్సువాడ నుంచి టీడీపీ తరఫున పోటీచేసి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు.
* 1998లో గృహ నిర్మాణ మంత్రిగా పనిచేశారు.
* 1999లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
* అప్పుడు భూగర్భ గనులు, జలవనరులశాఖ మంత్రిగా కొన్నిరోజులు పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా పనిచేశారు.
* 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
* 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
* 2011లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే టీడీపీకి రాజీనామా చేశారు.
* వెంటనే టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
* తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో 49 వేల మెజార్టీతో గెలపొందారు.
* తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 లో జరిగిన ఎన్నికల్లో బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి… వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
* 2018 ఎన్నికల్లో మళ్లీ బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version