ఆరుసార్లు కాంగ్రెస్ పార్టీకి మరో ఆరుసార్లు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టిన ఘనతను భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లు సొంతం చేసుకున్నారు.అలాగే ఒక్కసారి ప్రజారాజ్యం, మరోసారి వైసీపీని కూడా ఆదరించారు ఇక్కడి ఓటర్లు. విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్న భీమిలి ఈసారి 17వ ఎన్నికకు సిద్ధమైంది.నియోజకవర్గంలో ప్రస్తుతం 2,21,575 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,08,412 మంది ఉండగా, మహిళ ఓటర్లు 1,13,159 మంది ఉన్నారు. ఇక్కడ అత్యధికసార్లు ఆర్‌పీఎస్డీపీఎన్ రాజు విజయం అత్యధికంగా నాలుగుసార్లు గెలుపొందారు.ఈసారి అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ ల మధ్యే పోరు నడవబోతోంది.
భీమిలిలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే… 1952లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కె సూర్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు. 1955లో జరిగిన ఎన్నికల్లో పీఎస్పీపీ నుంచి పోటీ చేసిన జీకే రాజు, 1960లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పీవీజీ రాజు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 1962, 1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పీవీజీ రాజు వరుస విజయాలు సాధించారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సూర్యనారాయణ, 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డి జగన్నాథరాజు లు విజయం సాధించారు.
ఎన్ఠీఆర్ రాజకీయాలోకి రాకతో ఆయన స్థాపించిన టీడీపీ నుంచి 1983లో పోటీ చేసిన పి ఆనంద గజపతిరాజు విజయం సాధించారు. 1985,1989, 1994లో జరిగిన ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి ఆర్‌ఏపీస్డిపీఏఎన్ రాజు విజయాన్ని దక్కించుకున్నారు. 2004లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కర్రి సీతారామ్,2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు విజయం సాధించారు.2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు ఇక్కడ విజయం సాధించారు.2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు మళ్లీ ఇక్కడ గెలుపొందారు.
వైసీపీ నుంచి గెలిచిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు రెండేళ్లు మంత్రిగా పనిచేసి ప్రస్తుతం విశాఖజిల్లా వైసీపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.అయితే రానున్న మళ్లీ పోటీ చేసేందుకు వైసీపీ నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సిద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ నుంచి ప్రస్తుతం ఇన్‌చార్జ్‌గా రాజాబాబు ఉన్నారు. గంటా శ్రీనివాసరావు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.