పొంగులేటి పాలిటిక్స్..షర్మిలకు బెనిఫిట్ చేస్తున్నారా?

-

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఆయన బి‌ఆర్‌ఎస్ పార్టీకి దూరం జరిగి..సొంతంగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇంతకాలం బి‌ఆర్‌ఎస్ పార్టీలో ఉన్నా సరే సీటు ఇవ్వకుండా మోసం చేశారని, అలాగే కనీసం ఏ పదవి ఇవ్వలేదని, ఇక వచ్చే ఎన్నికల్లో సీటు కూడా డౌట్ అనే పరిస్తితుల నేపథ్యంలో పొంగులేటి బి‌ఆర్‌ఎస్ పార్టీకి దూరం జరిగిన విషయం తెలిసిందే.

కానీ ఆయన ఏ పార్టీలో చేరలేదు. కాకపోతే ఖమ్మం జిల్లాలో ప్రతి స్థానంలో తన అనుచరులతో ఆత్మీయ సమావేశాలు మాత్రం నిర్వహిస్తున్నారు. ఇక తన వర్గం బలం పెంచుకుంటున్నారు. అలాగే బి‌ఆర్‌ఎస్ పార్టీలో ఎవరికైతే సీట్లు దక్కవో వారందరినీ పొంగులేటి ఒకచోటుకు చేర్చుతున్నారు. వారితో సమావేశం అవుతూ..ఎక్కడకక్కడ సీట్లు ఫిక్స్ చేస్తున్నారు.  అయితే పొంగులేటి రాజకీయం కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది. ఆయన తన అనుచరులని తీసుకుని ఏదైనా పార్టీలోకి వెళ్తారా? లేదా తనతో పాటు తన అనుచరులని ఇండిపెండెంట్లుగా బరిలో దిగేలా చేస్తారనేది క్లారిటీ లేదు.

అయితే ఆయన బి‌జే‌పిలో చేరతారని ప్రచారం జరిగింది..అటు వైపు వెళ్లలేదు. కాంగ్రెస్ ఆహ్వానించింది కానీ అటు వెళ్లలేదు. ఇటు షర్మిల పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. అది జరగడం లేదు. కాకపోతే ఎక్కడకక్కడ తన అనుచరులని పోటీకి రెడీ చేస్తున్నారు. తాజాగా వైరా సీటులో తాజాగా విజయా భాయ్ పోటీ చేస్తారని ప్రకటించారు.

2018 ఎన్నికల్లో సిపిఐ నుంచి వైరా నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విజయ..ఇప్పుడు పొంగులేటి వర్గంలో చేరారు. దీంతో వైరా నుంచి తమ అభ్యర్థిగా వుంటుందని ప్రకటించారు. ఇక పొంగులేటి తాజాగా విజయమ్మని కలిశారని, ఈ నెల 8న షర్మిల పాదయాత్ర ముగింపు సభ ఖమ్మంలో ఉంటుందని, అప్పుడు తన అనుచరులతో కలిసి ఆయన వైఎస్సార్ టీపీలో చేరతారని తెలిసింది. చూడాలి మరి పొంగులేటి పయనం ఎటు వైపు ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version