పువ్వాడపై రేణుకా పోటీ..ఖమ్మంలో గెలుపెవరిది?

-

ఖమ్మం గడ్డ కమ్యూనిస్టుల అడ్డా..ఇది ఒకప్పుడు సన్నివేశం..ఇప్పుడు ఖమ్మం గడ్డలో కారు హవా నడుస్తోంది. ఖమ్మం అసెంబ్లీ స్థానంలో మంత్రి పువ్వాడ అజయ్ దూసుకెళుతున్నారు. అయితే అలాంటి స్థానంలో తనపై కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరీ పోటీ చేయాలని పువ్వాడ ఛాలెంజ్ చేశారు. తాజాగా నిరుద్యోగ నిరసన ర్యాలీ పేరుతో టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖమ్మంకు వచ్చారు..ఈ ర్యాలీలో రేణుకా చౌదరీ కూడా పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే రేవంత్, రేణుకా కలిసి మంత్రి పువ్వాడ టార్గెట్ గా విమర్శలు చేశారు. ఒంటి కన్ను రాక్షసుడు అని, కబ్జా కోరు అంటూ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో మంత్రి పువ్వాడ స్పందిస్తూ..ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ అని, ఆయన మాటలు ప్రజలు నమ్మరని అన్నారు. ఇక రేణుకా గురించి అందరికీ తెలుసని, టికెట్లు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇక రేణుకాకు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు.

 

ఇలా సవాళ్ళతో ఖమ్మం పోరు ఆసక్తికరంగా మారింది. అయితే ఖమ్మం అసెంబ్లీలో ప్రస్తుతానికి పువ్వాడపై పోటీ చేసే ప్రత్యర్ధి కనబడటం లేదు. ఒకవేళ కాంగ్రెస్ నుంచి రేణుకా పోటీ చేస్తే పోరు రసవత్తరంగా ఉంటుంది. అయితే ఖమ్మంలో ఎక్కువసార్లు సి‌పి‌ఐ గెలిచింది. 8 సార్లు సి‌పి‌ఐ, 3 సార్లు పి‌డి‌ఎఫ్ గెలిచాయి. మూడుసార్లు కాంగ్రెస్ గెలిచింది. ఒకసారి టి‌డి‌పి గెలిచింది.

అయితే 2014లో పువ్వాడ కాంగ్రెస్ నుంచే గెలిచి బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్లారు. 2018లో పువ్వాడ బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేయగా, కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పొత్తులో భాగంగా టి‌డి‌పి నుంచి నామా నాగేశ్వరరావు పోటీ చేశారు. అయితే విజయం పువ్వాడని వరించింది. ఇప్పుడు మూడోసారి పోటీకి రెడీ అయ్యారు. ఎలాగో కమ్యూనిస్టులతో పొత్తు ఉంది కాబట్టి..పువ్వాడకు ప్లస్ అవ్వవచ్చు. మరి కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version