తెలుగురాష్ట్రాల్లో కరోనా సందర్భంగా విధించిన లాక్‌డౌన్‌లో సడలింపులు మొదలవగా ఇప్పటికే దాదాపుగా అన్ని షాపులకు, సంస్దలకు అనుమతులు లభించాయి.. కాగా బస్సులు, రైళ్లు కూడా ప్రారంభం అయ్యాయి.. ఇప్పటికే ప్రజలు వారి వారి గ్రామాలకు చేరుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయాణాలు కూడా కొనసాగిస్తున్నారు.. ఈ నేపధ్యంలో రైళ్లతో పాటుగా రైల్వే స్టేషన్లకు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి.. ఎప్పుడైతే ఈ ప్రయాణాలు మొదలైయ్యాయో అప్పటి నుండి ఏపీలో కరోనా వైరస్ విజృంభించడం మొదలు పెట్టింది.. ఫలితంగా కేసులు పెరగడంతో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఈ క్రమంలో రైలు ప్రయాణికుల నుంచి ఈ వైరస్ మరింత విస్తరించకుండా ఉండటానికి దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్)కు ఇక్కడి ప్రత్యేక రైళ్ల హాల్టింగ్ స్టేషన్లను తగ్గించాలంటూ విజ్ఞప్తి చేసింది. దాంతో ఎస్సీఆర్ జోన్ అధికారులు ప్రత్యేక రైళ్ల స్టాపుల సంఖ్యను తగ్గిస్తూ ఒక ప్రకట జారి చేశారు.. అయితే రద్దు చేసిన స్టాపుల్లో ఎక్కేందుకు, దిగేందుకు టికెట్లను రిజర్వు చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు రీఫండ్ చేస్తామని వెల్లడించారు. కాగా ఈ విధానం గురువారం నుంచి అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు.. ఇకపోతే ఏపీ గుండా రద్దయిన స్టాపుల వివరాలు చూస్తే.. ఫలక్‌నామా(సికింద్రాబాద్ – హౌరా) – పిడుగురాళ్ల, తాడేపల్లిగూడెం.. ఫలక్‌నామా(హౌరా -సికింద్రాబాద్) – సామర్లకోట, పలాస, ఇచ్చాపురం.. గోల్కొండ (సికింద్రాబాద్ – గుంటూరు) – కొండపల్లి, రాయనపాడు, కృష్ణా కెనాల్, మంగళగిరి, నంబూరు, పెదకాకాని..
గోల్కొండ (గుంటూరు- సికింద్రాబాద్) – కొండపల్లి, రాయనపాడు, నంబూరు, పెదకాకాని.. రాయలసీమ( తిరుపతి – నిజామాబాద్) – రేణిగుంట, కోడూరు, ఓబులవారిపల్లె.. రాయలసీమ( నిజామాబాద్- తిరుపతి ) రేణిగుంట, కోడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, రాజంపేట, నందలూరు, కమలాపురం, ఎర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం, తాడిపత్రి, గుత్తి.. గోదావరి(హైదరాబాద్ – విశాఖపట్నం) – తాడేపల్లిదుగెం, నిడదవోలు, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం, ఎలమంచిలి, దువ్వాడ.. కోణార్క్(సీఎస్టీ ముంబై – భువనేశ్వర్) – తాడేపల్లిగూడెం, నిడదవోలు, సామర్లకోట, పిఠాపురం, తుని, అనకాపల్లి, పలాస, సోంపేట, ఇచ్చాపురం.. ఉద్యాన్(సీఎస్టీ ముంబై – కేఎస్ఆర్ బెంగళూరు) – ఆదోని, గుత్తి, ధర్మవరం, సత్యసాయి ప్రశాంతి నిలయం, పెనుగొండ, హిందూపూర్.. సంఘమిత్ర(దానాపూర్ – కేఎస్ఆర్ బెంగళూరు) – గూడూరు, రేణిగుంట.. ఏపీ( విశాఖపట్నం- న్యూఢిల్లీ) – దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, తాడేపల్లిగూడెం.. దురంతో(హౌరా – యశ్వంత్‌పూర్) – విజయనగరం..