ఒక్కొక్కటీ నరుక్కుంటూ వస్తున్న రామోజీ .. నెక్స్ట్ స్టెప్ ఏంటి ?

-

మీడియా మొఘల్ రామోజీరావు ఇటీవల కరోనా వైరస్ బాధితులను ఆదుకోవడంలో కోసం రెండు తెలుగు రాష్ట్రాల కు చెరో కోటి రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఈనాడు పత్రిక మార్కెట్ రోజురోజుకీ తరిగిపోతున్న తరుణంలో ఒక్కొక్కటిగా నరుక్కుంటూ రామోజీరావు…ఈనాడు పేపర్లో పేజీలను తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇంటర్నెట్, ఆట, వసుంధర, ఈనాడు సినిమా పేజీలకు గతంలో ఫుల్ పేజీ ఈనాడు పత్రికలో ఉండేవి.అయితే ఇప్పుడు మాత్రం రోజురోజుకీ పత్రిక రంగం దిగజారిపోతున్న తరుణంలో వీటన్నిటినీ ఒకచోట చేరుస్తూ ఈనాడు పత్రిక పేజీలో తగ్గిస్తూ ప్రచురితం చేస్తున్నారు. ప్రతి సండే ఏదో ఒక స్పెషల్ ఆర్టికల్ తో దర్శనమిచ్చే ఈనాడు అది కూడా ఇటీవల తీసేసింది. అయితే కరోనా వైరస్ ఎఫెక్టుతో చాలావరకూ పత్రికారంగం దెబ్బతినటంతో ఈనాడు విషయంలో రామోజీరావు నెక్స్ట్ స్టెప్ ఏంటి ? అన్న దాని గురించి రకరకాల కామెంట్లు వినబడుతున్నాయి.

 

అవి ఏమిటంటే హైదరాబాద్ కేంద్రంగా ఈనాడు పత్రికా రంగాన్ని ఫుల్ అవుట్ సోర్సింగ్ గా రామోజీరావు ఇచ్చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టెక్నాలజీ పరంగా, పత్రికా రంగం పూర్తిగా దెబ్బతినడంతో మొన్నటి వరకు బానే లాకోచ్చిన రామోజీరావు ప్రస్తుతం మాత్రం….పత్రికా రంగాన్ని ఇతరుల చేతుల్లో పెట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుగు మీడియా వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version