రసమయికి ఆరేపల్లితో చిక్కులు..మానకొండూరు ఎవరి సొంతం?

-

తెలంగాణలో అభ్యర్థుల జాబితా ప్రకటించిన నాటి నుంచి బి‌ఆర్‌ఎస్ పార్టీకి రోజుకొక నేత బయటకొస్తున్నట్లు కనిపిస్తున్నారు. సీట్లు ఆశించి భంగపడ్డ నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. కొందరు అధిష్టానం ఏది చెబితే అది చేస్తామని అంటున్నారు. కానీ కొందరు మాత్రం పార్టీ జంప్ అయిపోతున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు పార్టీ మారారు. ఇటీవలే మానకొండూరు నేత ఆరేపల్లి మోహన్ సైతం బి‌ఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

మానకొండూరు స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కి ప్రకటించారు. ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన ఆరేపల్లి మోహన్, ఆ టిక్కెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయికి ఇవ్వడంతో నిరాశ చెంది పార్టీకి రాజీనామా చేశారు. మానకొండూరులో ఆరేపల్లికి మంచి పట్టు ఉంది. ఆరేపల్లి మోహన్ రాజీనామా తో బిఆర్ఎస్ గ్రాఫ్ ఢీలా పడుతుంది అని రాజకీయ వర్గాల అభిప్రాయం. ఆరేపల్లి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బిజెపిలో చేరుతారని సన్నిహిత వర్గాలు అంటున్నారు. కొందరు ఏమో కాంగ్రెస్ లోకి వెళ్తారని అంటున్నారు.

అయితే ఆరేపల్లి ఏ పార్టీలో  పోటీ చేసినా  లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేసినా మానకొండూరులో రసమయికి ఓటమి తప్పదు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీంతో రసమయికి హ్యాట్రిక్ మిస్ అవుతుందా? అని విశ్లేషణలు వస్తున్నాయి. కానీ పార్టీ పరంగా బి‌ఆర్‌ఎస్ స్ట్రాంగ్. అటు కాంగ్రెస్ కేడర్ కూడా ఉంది.

ఒకవేళ ఆరేపల్లి కాంగ్రెస్ లోకి వెళ్ళి పోటీ చేస్తే రసమయికి గట్టి పోటీ ఎదురవుతుంది. కానీ అదే సమయంలో కాంగ్రెస్ లో సీటు ఆశించే వారు ఉన్నారు. దీంతో అక్కడ కూడా పోరు తప్పదు.మొత్తానికి మానకొండూరులో పోరు రసవత్తరంగా సాగనుంది. మరి ఈ సారి ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version