ఎన్నికల కోసమే మహిళా బిల్లు : షర్మిల

-

మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే చారిత్రక ఘట్టానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నామని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. మహిళా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం శుభపరిణామమని ఇవాళ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. జనాభాలో సగభాగమైన మహిళలు సమాన హక్కులు పొందే రోజు కోసం ఎదురుచూస్తున్నాని వెల్లడించారు. ఈ ఎన్నికల సమయంలో ఈ బిల్లు ప్రవేశపెట్టడంపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

రాజకీయ అవకాశవాదం కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం పని చేయాలని షర్మిల అన్నారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి మోదీ ప్రభుత్వం ఇంత సమయం తీసుకోవడం బాధాకరమన్నారు. బిల్లు ఆమోదంలో రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు ఈ బిల్లును రాజకీయ అవకాశవాదంగా ఉపయోగించవద్దని షర్మిల సూచించారు. బిల్లు ముఖ్య ఉద్దేశ్యం దెబ్బతినే అవకాశముంది. దశాబ్దాలుగా పోరాడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు.. రాజకీయాలకు అతీతంగా మనస్ఫూర్తిగా అందరం మద్దతిద్దామని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మూడోవంతు సీట్లు మహిళ అభ్యర్థులకు కేటాయించబడతాయని వైఎస్ షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటులో మహిళ రిజర్వేషన్ బిల్లును గతంలో పలుమార్లు ప్రవేశపెట్టినప్పటికీ పూర్తిస్థాయి మెజారిటీ లభించకపోవడంతో బిల్లు వీగిపోయేది. అన్ని పార్టీలు ఈ బిల్లుపై సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టడం సరి అయిందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ… ఈ కీలక బిల్లుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version