రాయల తెలంగాణ డిమాండ్..సువర్ణాంధ్ర అంటూ బీఆర్ఎస్ ఎత్తు.!

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగేప్పుడు..విభజనపై రకరకాల ప్రచారాలు..డిమాండ్లు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని, అలాగే రాయలసీమలోని కర్నూలు, అనంతపురంలని తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ చేయాలని డిమాండ్ వచ్చింది. ప్రధానంగా ఈ డిమాండ్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి చేస్తూ వచ్చారు.

అయితే రాష్ట్రం విడిపోయి 9 ఏళ్ళు అయ్యాక..ఇప్పుడు కూడా జేసీ దివాకర్..అదే తరహాలో డిమాండ్ చేశారు.  కేసీఆర్ ముందు చూపుతోనే కాళేశ్వరం ప్రాజక్టును నిర్మించారని పెద్దమనస్సుతో ఆ నాటికి రాయలసీమకు మళ్లించాలని..రాయల తెలంగాణ కావాలని దాని కోసం కృషి చేస్తానని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక జేసీ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు.

రాయల తెలంగాణ కోరడం తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకుపోవడానికి నిదర్శనమని, తెలంగాణలో కలపాలని తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కోరడం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి నిదర్శనమని, తెలంగాణాలో కలపండి లేకపోతే మా దగ్గరికి రండి అని తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజలు కేసీఆర్‌ని ఆహ్వానిస్తున్నారని, ఇక తెలంగాణ బంగారు తెలంగాణగా మారినట్టే సువర్ణాంధ్ర నిర్మాణం సాధ్యమని జగదీశ్ చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ జగదీశ్ తెలివిగా మాట్లాడారని చెప్పవచ్చు. ఇప్పుడు ఎలాగో బి‌ఆర్‌ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లో కే‌సి‌ఆర్ హల్చల్ చేస్తున్నారు.

ఏపీలో కూడా బి‌ఆర్‌ఎస్ పార్టీని పెట్టారు. దీంతో అక్కడ కూడా రాజకీయంగా పై చేయి సాధించాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు. ఇక రాయల తెలంగాణ డిమాండ్ పెట్టిన నేపథ్యంలో..అవేమీ సాధ్యం కాదని, కానీ ఏపీలో కూడా కే‌సి‌ఆర్ పాలన కావాలని, అంటే అక్కడ బి‌ఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని అన్నట్లుగా జగదీశ్ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version