రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ట్వీట్ వార్

-

ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి ఆయనకు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేంత వార్ నడుస్తోంది. ఒకరిపైమరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ మునుగోడు ఉపఎన్నికలో ఇరువురు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా రేవంత్ ను టార్గెట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. దీనిపై రేవంత్ తీవ్రంగా మండిపడ్డారు.

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో తనకు సంబంధం ఉందంటూ భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన ఆరోపణలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ‘రేవంత్‌రెడ్డి నాటకాలకు, కల్వకుంట్ల కవిత డ్రామాలకు దిల్లీ లిక్కర్‌ కుంభకోణం తెర దించింది, దిల్లీలో తీగ లాగితే ప్రగతిభవన్‌, గాంధీభవన్‌ వ్యాపార సంబంధాల డొంక కదిలింది’ అంటూ రాజగోపాల్‌రెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలను రేవంత్ తీవ్రంగా ఖండించారు. ‘ఇలాంటి చిల్లర కథలు..మునుగోడులో మిమ్మల్ని కాపాడలేవని పేర్కొన్నారు.2010 ఫిబ్రవరి 2న అడికోర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రై.లి.కంపెనీలో డైరెక్టర్‌గా చేరి, 13 రోజుల్లో అంటే ఫిబ్రవరి 15న రాజీనామా చేశానని, ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే 2013లో ఆ కంపెనీ క్లోజ్‌ అయిందని’ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన పత్రాలను ట్వీట్‌కు జత చేశారు. ‘చచ్చిన బర్రె పగిలిన కుండ నిండా పాలిచ్చిందన్నట్టు’ రాజగోపాల్‌ వ్యవహారం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version