ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌

-

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మరో సంచలన నిర్నయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ కోరుతూ 1338 మంది ఉద్యోగుల దరఖాస్తు చేసుకున్నారు.

cm jagan

ఏపీ నుంచి తెలంగాణకు 1804 మంది ఉద్యోగుల దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే.. వారందరి కోరిక మేరకు ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర వంటి కరవు ప్రాంతాల్లో చెరువులను కాల్వల ద్వారా అనుసంధానం చేయాలని తెలిపారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని చెరువుల పరిస్థితి పై అధ్యయనం చేయాలని.. ఒకవేళ అవసరమైన చోట చెరువులు లేకపోతే కొత్తగా చెరువులు నిర్మించాలని వివరించారు.

ఈ చెరువులు అన్నింటినీ గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించేలా కాల్వలతో అనుసంధానం చేయాలని… దీని వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని చెప్పారు. పర్యావరణ సమతుల్యత ఉంటుందన్నారు. అలాగే.. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో మూడు పోర్టులు కడుతున్నామని.. వీటి చుట్టు పక్కల అభివృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version