మీ అందరి మీద రేవంత్‌కు పగ.. అందుకే హైడ్రా తెచ్చాడు : కేటీఆర్

-

బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని, అందుకే గత అసెంబ్లీ, అంతకు ముందు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమను గెలిపించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదని, అందుకే రేవంత్ నగర ప్రజలపై పగ పెంచుకున్నారని విమర్శించారు.అందువల్లే రేవంత్ హైడ్రాను తీసుకొచ్చారని, దానిని అడ్డం పెట్టుకుని హైడ్రామా చేస్తున్నారని విమర్శించారు.

ఇక్కడి ప్రజలంతా మా వారే. ఎలాంటి ప్రాంతీయ ద్వేషం లేదు. మేము ఎంతో మంది సీఎంలను చూశాం. వారితో పోల్చితే రేవంత్ చిట్టి నాయుడు లాంటి వాడని’ వ్యాఖ్యానించాడు.అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీని బతకడానికి వచ్చిన ఆంధ్ర వ్యక్తి అని సంభోదించడంపై బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. నగరంలో మరోసారి ప్రాంతీయ విభేదాలకు పోకుండా ఉండేందుకు నేరుగా కేటీఆర్ రంగంలోకి దిగినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version