రేవంత్ సైడ్ క్యారెక్టర్..స్ట్రాటజీ మారుస్తున్నారా?

-

ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాత్ర కాస్త తగ్గిందనే సంగతి తెలిసిందే. టి‌పి‌సి‌సి పదవి వచ్చాక రేవంత్ దూకుడుగానే రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు. కేసీఆర్‌ని టార్గెట్ చేసి, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, కాంగ్రెస్ పార్టీని రేసులోకి తీసుకొచ్చేశారు. దీంతో రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు వార్ నడిచింది.

రేవంత్ రెడ్డి | Revanth Reddy

కానీ అనూహ్యంగా హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత పరిస్తితి తారుమారైంది. హుజూరాబాద్‌లో బీజేపీ తరుపున ఈటల గెలవడం, అటు కాంగ్రెస్‌కు కనీసం 3 వేల ఓట్లు కూడా రాకపోవడంతో రేవంత్ కాస్త సైలెంట్ అయ్యారు. పైగా కేసీఆర్ ఏమో బీజేపీనే ఎక్కువ టార్గెట్ చేశారు. దీంతో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మాదిరిగా వార్ మారింది. దీనికి తోడు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు పెరిగాయి…కాంగ్రెస్ నేతలు హుజూరాబాద్ ఓటమి దగ్గరే ఆగిపోయారు.

ఈలోపు రాజకీయం చాలా మారిపోయింది. టీఆర్ఎస్, బీజేపీ పోరులో ముందుకెళుతుంటే కాంగ్రెస్ వెనుకబడిపోయింది. కేసీఆర్, బండి సంజయ్‌లే హైలైట్ అవుతూ వస్తున్నారు. దీంతో రేవంత్‌ది సైడ్ క్యారెక్టర్ అన్నట్లు పరిస్తితి మారింది. ఇక పరిస్తితి నుంచి బయటకురావడానికి రేవంత్ దూకుడు పెంచారు. మళ్ళీ కాంగ్రెస్‌ని రేసులో పెట్టడానికి సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నారు. ఎలాగో ధాన్యం అంశంపై టీఆర్ఎస్, బీజేపీల మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అసలు రెండు పార్టీలు రైతులతో రాజకీయం చేస్తున్నాయని, రైతులని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాలనే డిమాండ్‌తో రేవంత్ ముందుకొస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లో ఆందోళన చేశారు. ఇక నుంచి నియోజకవర్గాల్లో రైతులకు అండగా ఉండేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. కల్లాల్లోకి కాంగ్రెస్ పేరుతో…కల్లాల్లో ఉన్న ధాన్యం వెంటనే కొనుగోలు చేసి రైతులని ఆదుకోవాలని రేవంత్ క్షేత్ర స్థాయిలో పోరాటం చేయడానికి సిద్ధమయ్యారు. దీని ద్వారా రెండు పార్టీలకు చెక్ పెట్టొచ్చని రేవంత్ చూస్తున్నారు. చూడాలి మరి రేవంత్ స్ట్రాటజీలు ఏ మేర వర్కౌట్ అవుతాయో.

Read more RELATED
Recommended to you

Exit mobile version