రోహిత్ రెడ్డికి రివర్స్.. కేసీఆర్ దగ్గరకు..పక్కాగా బిగిస్తున్నారా?

-

ఆ మధ్య ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడానికి బీజేపీతో సంబంధాలు ఉన్న నందకుమార్, సింహయాజులు, రామచంద్రభారతి ట్రై చేసినట్లు ఆడియో, వీడియో క్లిప్పింగ్‌లు బయటకొచ్చాయి. అలాగే వారిని పోలీసులు అరెస్ట్ చేయడం..బెయిల్ పై రావడం జరిగాయి.

ఈ కొనుగోలు అంశంలో ఉన్న ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షంవర్ధన్ రెడ్డి..అయితే ఆడియో , వీడియోలు పకడ్బంధిగా ఉండేలా ప్లాన్ చేసి, వాటిని లీక్ చేసింది రోహిత్ రెడ్డి అని ప్రచారం ఉంది. ఈ కేసు విషయంలో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీని టార్గెట్ చేయడానికి గట్టి అస్త్రం దొరికింది. పలువురు అగ్రనేతలకు కూడా నోటీసులు ఇచ్చారు.

అయితే ఆ కేసు అలా నడుస్తుండగానే ఐటీ, ఈడీ, సి‌బి‌ఐ  సంస్థలు..బీఆర్ఎస్ నేతల టార్గెట్ గా రైడ్స్ జరుపుతున్నారు. పన్ను ఎగవేత, వ్యాపారాలు, లిక్కర్ స్కామ్ ఇలా పలు అంశాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలకు చిక్కులు వచ్చాయి. ఇదే క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కీలకంగా ఉన్న రోహిత్ రెడ్డికి తాజాగా ఈడీ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి..సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు రోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. వీరిని ఈ నెల 19 న విచారణకు హాజరు కావాలని సూచించారు. అయితే తనకు నోటీసులు ఇచ్చారు గాని..ఏ కేసు విషయంలో తెలియదని రోహిత్ చెప్పుకొచ్చారు. ఇక ఈడీ నోటీసులు అంశంపై నేడు కేసీఆర్‌తో రోహిత్ రెడ్డి భేటీ కానున్నారు. అలాగే ఇలాంటి నోటీసులకు తాను భయపడనని చెబుతున్నారు.

అయితే బెంగళూరులో గతేడాది శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీకి రోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ పార్టీకి మాదకద్రవ్యాలు భారీగా సరఫరా అయినట్లు ఈడీ కేసు కొనసాగుతోంది. ఇప్పటికే చాలామందిని ఈ కేసుపై ప్రశ్నించారు అధికారులు… ఇప్పుడు రోహిత్ కు నోటీసులు రావడంతో అదే కేసుకు సంబంధించి ఇచ్చి ఉంటారనే చర్చ సాగుతోంది. మొత్తానికి రోహిత్ టార్గెట్ గా ఈడీ ముందుకెళ్లెలా ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version