శివసేన మంత్రుల అనుచరులు ఇళ్లలో ఐటీ దాడులు

-

మహారాష్ట్ర మహా వికాస్ ఆఘాడీలో భాగం అయిన శివసేన పార్టీ మంత్రుల అనుచరుల ఇళ్లపై ఐటీ దాడులు చేస్తోంది. ముంబాయితో పాటు పుణేలోని పలువురిని నివాసాలపై దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర మంత్రులు ఆదిత్య ఠాక్రే, అనిల్ పరాబ్ అనుచరుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. 

దీనిపై శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంపై ఫైర్ అయ్యారు. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని.. మహారాష్ట్ర , బెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వాలపై దాడులు చేస్తోందని ఆరోపించారు. ముంబై పోలీసులు క్రిమినల్ సిండికేట్, దోపిడి రాకెట్ కు సహకరిస్తున్న ఈడీ అధికారులపై విచారణ చేపడుతామని.. అందులో కొంతమంది జైలుకు కూడా వెళ్తారని.. నామాటలు గుర్తుపెట్టుకోండంటూ… వార్నింగ్ ఇచ్చారు సంజయ్ రౌత్. కొంతమంది ఈడీ అధికారులు బీజేపీ టికెట్ పై ఎన్నికల్లో పోటీచేస్తున్నారని.. ఈడీ బీజేపీకి ఏటీఎంగా మారిందని.. ఈ అధికారుల దోపిడీకి సంబంధించి రికార్డులను నేను ప్రధానమంత్రికి అందించానని వెల్లడించారు. ఈడీ అధికారులు కాంట్రాక్టర్లు, డెవలపర్లు, బిల్డర్ల నుంచి దోపిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version