తెలంగాణలో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీ అధిష్టానం ప్రకటిస్తే చోటుచేసుకునే పరిణామాలపై ఇప్పుడు అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఆసక్తి గా ఉన్నారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. అయితే ఇటీవల జరిగిన ఒక మీడియా చర్చావేదికలో ఆయన మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
తనకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా బాధ్యతలు కావాలని ఈ బాధ్యతలు తీసుకున్న చాలామంది నేతలు గతంలో విజయవంతమయ్యారు అని చెప్పారు. అవకాశం ఉంటే తాను కూడా అదే పదవి తీసుకుంటానని చెప్పారు. అయితే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి విషయంలో ఎలాంటి ఒత్తిడి చేయకుండా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఒకవేళ రేవంత్ రెడ్డి ఆ పదవి కోసం ముందుకు రాలేదు అంటే ఆయనకు కాకుండా మరో నేతకు ఆ పదవిని అప్పగించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డి ప్రతిపాదన మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా కొండా సురేఖను నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. కొండా సురేఖ ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ద్వారానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలోపేతమవుతుందని అన్నారు.
కాబట్టి ఆయన నాయకత్వంలో పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి కొండా సురేఖను రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలి గా చేయాలని చేసి తాను ప్రచార కమిటీ చైర్మన్గా ఉండిపోయే ఆలోచనలో ఉన్నారట.