ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు మన బడి నాడు – నేడుపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. ఈ సంధర్భంగా నాడు నేడు కింద మౌలిక సదుపాయాలు మార్చిన స్కూళ్ల ఫొటోలు పరిశీలించిన సీఎం రాష్ట్ర వ్యాప్తంగా పక్కా భవనాలు లేని 390 పాఠశాలలకు భవనాల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ సమీక్షలో సీబీఎస్‌ఈ విధానంపై సీఎం కీలక ప్రకటన చేశారు.
2021–22 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 7వ తరగతి వరకూ సీబీఎస్‌ఈ విధానం అమలు చేయాలనీ. తర్వాత తరగతులకు ఒక్కో ఏడాదీ అమలు చేయాలనీ ఆదేశించారు. 2024 విద్యా సంవత్సరానికల్లా సీబీఎస్‌ఈ విధానంలోకి 1 నుంచి 10 తరగతి వరకూ విద్యార్థులు వస్తారని పేర్కొన్నారు. విద్యా కానుకలో ఇంగ్లిషు – తెలుగు డిక్షనరీని చేర్చాలని, విద్యా కానుక కిట్‌లో ఈసారి తప్పనిసరిగా డిక్షనరీ ఉండాలని అన్నారు. పాఠ్య పుస్తకాలు క్వాలిటీగా ఉండాలన్న ఆయన ప్రైవేటు స్కూళ్లలో ఇస్తున్న పుస్తకాల నాణ్యతతో పోటీగా ఉండాలని అన్నారు.