రాజకీయ ఉద్వేగ ఝరిలో మరో మార్పు
ఎప్పటి నుంచో ప్రతిపాదిత పెద్దల సభకు
ప్రతిపాదిత తేజస్సు..త్వరలో ఆ ఉషస్సు
రానుంది మనముందుకు
ఢిల్లీ వీధుల్లో దేశ రాజధానిలో
మన శ్రీకాకుళం గళం ..కృపారాణి రూపాన
మాట తప్పని సీఎం.. మాట తప్పని నైజానికి తార్కాణం ఇస్తూ నిలబడే వ్యక్తిత్వం.. ఆ కట్టుబాటు నాన్నది.. ఆ తలవొంచని నైజం నాన్నది.. నాన్న వైఎస్ నుంచి నేటి జగన్ వరకూ ఉత్తరాంధ్ర అంటే ప్రత్యేక అభిమానం.. అభివ్యక్తి కూడా! అందుకే మరో సారి ఈ తూరుపు ప్రాంతానికి ఈ పచ్చని చేలల్లో నడిచే ఉషోదయ కాంతులకు మరో సారి అభివందనం చెబుతూ మరో శుభవార్త ఇస్తున్నారు యువ ముఖ్యమంత్రి జగన్.దిగ్గజ నేతను ఢీ కొన్న అనుభవశాలి, ప్రజ్ఞాశీలి, సిక్కోలు ధీర కృపారాణికి త్వరలో పెద్దల సభలో పదవీ యోగం.
ప్రభావ శీలక ధోరణిలో పని చేసేందుకు, నమ్మిన సిద్ధాంతం ఆచరించేందుకు, ఆచరణ యోగ్యత ఉన్న మాటలు చెప్పేందుకు ఎప్పుడూ ముందు వరుసలో మహిళ నాయక గణంలో ఆమె ప్రథమ శ్రేణీ వ్యక్తి. దిగ్గజ నేత కింజరాపు ఎర్రన్నాయుడును ఓడించి, అనూహ్య రీతిలో శ్రీకాకుళ రాజకీయాలను శాసించిన నైజం అసమాన ప్రతిభకు, అపూర్వ సమర్థతకు తార్కాణం. ఇప్పుడామెకు రాజ్యసభలో చోటివ్వాలన్నది యువ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తలంపు.
సంకల్పం కూడా! అందుకు తగ్గ సమర్థత, యోగ్యత అన్నవి ఆమె ఆభరణాలు. దేశ రాజధానిలో మరో ఆరంభం పునః ప్రారంభ వీచిక అని రాయాలి ఆమె ఆగమన సందర్భాన మరోసారి హస్తిన పురి రాజకీయాలో విపక్ష పార్టీని ఢీ కొనాలన్న ఆలోచన,అభివ్యక్తి త్వరలో ఆమె అభీష్టం నెరవేర్పుతోనే సాధ్యం.
దిగ్గజ నేత కింజరాపు ఎర్రన్నాయుడి ఊరు నిమ్మాడ.. ఆ రోజు అక్కడ సర్పంచ్ ను నిలబెట్టేందుకే వీల్లేదు. అటువంటి పరిణామాన ఆమె తన మాట నిలుపుకున్నారు. తాను నెగ్గి తన తరఫున సర్పంచ్ ను గెలిపించి ప్రత్యర్థులకు రివర్స్ పంచ్ విసిరారు. అంతేకాదు నాటి సార్వత్రిక ఎన్నికల్లోనూ అనూహ్య విజయం ఆమెది. ఎనభై వేలకు పైచీలుకు మెజార్టీ.. అక్కడి నుంచి పార్లమెంటు రాజకీయాల్లో ఆమె ప్రస్థానంను మరువదు శ్రీకాకుళం.
నాడు టెలికాం కమ్యూనికేషన్ల శాఖకు సహాయ మంత్రిగా పనిచేశారు. తనదైన ముద్ర వేశారు.తరువాత కూడా ఆమె రాజకీయాల్లో క్రియాశీలకం అయ్యారు. ఇప్పుడు ఆమె మరోమారు హస్తినపురి దారుల్లో అరంగేట్రం చేయనున్నారు. ఈ పునరాగమనానికి జనాభీష్టం.. అధిష్టాన అభీష్టం రెండూ కలవనున్నాయి. రెండూ కలిసి ఆమె జాతక చక్రాన్ని అదృష్ట రేఖలను మార్చనున్నాయి.
రాజకీయాల్లో విమర్శలకు విలువ ఇస్తారు. సమున్నత రీతిలో భాషకు విలువ ఇస్తారు. విలువలతో కూడిన రాజకీయ ప్రస్థానంలో విభేదాన్ని స్వీకరిస్తారు. విభేదాన్ని పరిష్కరించి ప్రత్యర్థులకు జవాబు చెబుతారు. వైస్సార్సీపీ ప్రగతిలో ఇవాళ ఆమె మరింత కీలకం కానున్నారు. సామాజిక ఎదుగుదల ఎంతో ముఖ్యం. అదే విధంగా వ్యక్తి ఉన్నతి కూడా అంతే ముఖ్యం. సైద్ధాంతిక భావ జాల వ్యాప్తిలో వైసీపీ ఆమెకు సముచిత స్థానం ఇవ్వనుంది. దేశ రాజకీయాల్లో మరోసారి ఆమె టీడీపీని ఢీ కొననున్నారు.
విపక్ష భావ జాలాన్ని ఎదుర్కొని, విష ప్రచారాన్ని నిలువరించి విషయ పాఠవాన్ని నిరూపించనున్నారు. గతంలో కూడా సమర్థనీయ ధోరణిలో పార్లమెంట్ వేదికల్లో మాట్లాడిన సందర్భాలున్నాయి. వాటికి కొనసాగింపుగా త్వరలో ఈ ఉత్తరాంధ్ర మహిళా నేతకు అత్యున్నత సభలో అత్యుత్తమ స్థానం. ఉత్తరాంధ్ర మహిళా నాయకత్వానికి అరుదైన గౌరవం. త్వరలో జూన్ లో జరగనున్న పెద్దల సభ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి వినిపించే ప్రాతినిధ్య స్వరానికి ముందుగానే జేజేలు. వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు.మాట తప్పని సమర్థతకు, సమర్థ నాయకత్వ ధోరణికి జేజేలు కూడా!