కాంగ్రెస్‌లో సునీల్ సర్వే కలకలం…!

-

మునుగోడు సీటుని ఎలాగైనా దక్కించుకోవాలని చెప్పి కాంగ్రెస్ కష్టపడుతుంది…టీఆర్ఎస్-బీజేపీలకు ధీటుగా రాజకీయం చేసి…తమ సిట్టింగ్ సీటుని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ లీడర్లు పనిచేస్తున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నా సరే …ఎలాగోలా వాటిని చక్కదిద్దుకుని మునుగోడులో గెలవాలని చూస్తుంది. అయితే కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం పెద్ద తలనొప్పి అయిన విషయం తెలిసిందే…ఆయన రేవంత్ రెడ్డి లక్ష్యంగానే విమర్శలు చేస్తున్నారు..కాంగ్రెస్ లో ఉంటూ విమర్శలు చేయడం ఆ పార్టీకి బాగా నష్టం చేకూర్చేలా ఉన్నాయి.

ఇక అభ్యర్ధి ఎంపిక విషయంలో నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం వద్దకు వెళ్ళి అభ్యర్ధి ఎంపిక విషయంలో కాంగ్రెస్ కుస్తీ పడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి మూడు ఆప్షన్స్ ఉన్నాయి. చల్లమల్ల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతిలతో పాటు ఇటీవల పార్టీలోకి వచ్చిన చెరకు సుధాకర్ సైతం టికెట్ రేసులో ఉన్నారు.

అయితే రెడ్డి వర్గానికే సీటు ఇవ్వాలనేది సీనియర్ల డిమాండ్..మళ్ళీ ఇందులో కొందరు కృష్ణారెడ్డికి మద్ధతు ఇస్తుంటే…మరికొందరు స్రవంతికి మద్ధతు ఇస్తున్నారు. ఇక ఇదేమి లేకుండా కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్…మునుగోడులో సర్వే చేసి బీసీ అభ్యర్ధిని పెడితేనే బెటర్ అని రిపోర్ట్ ఇచ్చారట. మునుగోడులో బీసీ ఓటర్లు ఎక్కువ. పైగా టీఆర్ఎస్-బీజేపీల నుంచి రెడ్డి అభ్యర్ధులు పోటీకి దిగుతున్నారు..కాబట్టి కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్ధిని పోటీకి దింపితే బెటర్ అని సునీల్ సర్వేలో తేలింది.

ప్రస్తుతానికి టీఆర్ఎస్ మొదట స్థానంలో ఉందని, కాంగ్రెస్ రెండోస్థానంలో ఉందని, బీజేపీది మూడో స్థానంలోనే ఉందని సునీల్ రిపోర్ట్ లో ఉందట…అయితే బీసీ అభ్యర్ధిని పెడితే కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని నివేదికలో ఇచ్చారట. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం చేయకపోయిన నష్టం లేదని సర్వేలో చెప్పారట. అయితే బీసీ అభ్యర్ధిని పెట్టడంపై జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది…వారు రెడ్డి అభ్యర్ధిపై మొగ్గు చూపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version