ఏపీలో వైసీపీ ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మాధవ్ న్యూడ్‌కాల్‌పై మహిళా సంఘాల ప్రతినిధులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ‘ డిగ్నిటీ ఫర్ ఉమెన్ ’ ఆధ్వర్యంలో ఐకాస నేతలు ఇవాళ ఢిల్లీలో రాష్ట్రపతిని కలిని వినతిపత్రం అందజేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచిన మాధవ్‌ను చట్ట సభల నుంచి బహిష్కరించాలని ముర్మును కోరారు. ఎంపీపై రాష్ట్ర డీజీపీకి, ఏపీ గవర్నర్‌కు వినతిపత్రాలు ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఢిల్లీకి వరకు రావలసి వచ్చిందని మహిళా జేఏసీ నాయకులు మీడియా కు వివరించారు.
ఎంపీ మాధవ్‌పై రేపు కేసు కొనసాగుతుందని అటువంటి వ్యక్తిని ఇంకా ఎంపీగా ఏ విధంగా కొనసాగిస్తారని అన్నారు. ప్రభుత్వం గోరంట్ల మాధవ్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు మహిళా జేఏసీ నాయకులు. అతడిపై ఎందుకు చర్యలకు వెనకడుగు వేస్తున్నారని టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత ప్రశ్నించారు. రాజ్యాంగ నిబంధనలకు లోబడి చర్యలు తీసుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని రాష్ట్రపతి హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. మహిళల పట్ల రాష్ట్ర పోలీసులు వ్యవహరిస్తున్న తీరును కూడా వివరించామని మహిళా జేఏసీ నాయకులు తెలిపారు.