సూపర్ ట్విస్ట్: కేసీఆర్‌పై ఈటల పోటీ..రసవత్తరంగా గజ్వేల్ పోరు?

-

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ చోటు చేసుకుంటుందో అర్ధం కాకుండా ఉంటుంది…ఇప్పటికే మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది…టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య ట్రైయాంగిల్ ఫైట్ జరుగుతుంది. ఇక ఎవరికి వారు పైచేయి సాధించే క్రమంలో రోజుకో ట్విస్ట్ తెరపైకి వస్తుంది…ఇదే క్రమంలో తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ వచ్చింది…వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ లో పోటీ చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించారు. ఇప్పటికే గజ్వేల్ లో పోటీ చేస్తున్న విషయం బీజేపీ అధిష్టానానికి కూడా చెప్పానని ఈటల అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈటల చెబుతున్నారు…అలాగే కేసీఆర్ ని ఓడించడానికి గజ్వేల్ లో ఇప్పటినుంచి సీరియస్ గా వర్క్ చేస్తున్నామని అన్నారు. అయితే దాదాపు 18 ఏళ్ల పాటు కేసీఆర్ తో కలిసి పనిచేసిన ఈటల..టీఆర్ఎస్ వదిలి బీజేపీలోకి రావడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈటలని కేసీఆర్ ఏ విధంగా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయేలా చేశారో కూడా తెలిసిందే.

బీజేపీలోకి వచ్చాక ఈటల…కేసీఆర్ టార్గెట్ గా రాజకీయ వ్యూహాలు పన్నుతూ ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ అయ్యారు. అలాగే విజయ్ సంకల్ప్ సభ తర్వాత ఈటల మరింత దూకుడు పెంచారు..పైగా అంతకముందు అమిత్ షాతో భేటీ అయ్యి కూడా వచ్చారు. మరి ఆ భేటీలో ఏం మాట్లాడుకున్నారో తెలియదు గాని…ఇప్పుడు బీజేపీలో ఈటల దూకుడు పెంచారు..ఏకంగా ఇప్పుడు కేసీఆర్ పైనే పోటీకి దిగుతానని అంటున్నారు. పైగా బీజేపీ అధిష్టానానికి కూడా చెప్పానని అంటున్నారు.

అయితే కేసీఆర్-ఈటల మధ్య పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది…కానీ ఈటల విషయంలో బీజేపీ అధిష్టానం ఇంకా క్లారిటీ ఇవ్వాలి. అదే సమయంలో కేసీఆర్ నెక్స్ట్ నియోజకవర్గాన్ని మారుస్తారని ప్రచారం ఉంది..అలాగే ఎంపీగా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మరి ఇలాంటి పరిస్తితుల్లో కేసీఆర్-ఈటల మధ్య పోరు ఉంటుందా? లేదా? అనేది ఇప్పుడు చెప్పలేం. కానీ వీరి మధ్య పోరు ఉంటే…అది తెలంగాణ రాజకీయాల్లోనే హైలైట్ అవుతుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version