ఏపీ ఎలక్షన్ గురించి సుప్రీం తీర్పు ఇచ్చిన 3 గంటల్లో సంచలన పరిణామం..!!

-

రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేయడం జరిగింది. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రమేష్ కుమార్ తెలిపారు. దీంతో ఈ విషయంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ గవర్నర్ కి జగన్ ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో గవర్నర్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తన వద్దకు పిలిపించుకుని వివరణ అడిగారు. ఇటువంటి క్రమంలో సీఎం వైఎస్ జగన్ ఈ విషయంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఆరు వారల పాటు ఎన్నికలు వాయిదా వేస్తున్న తీసుకున్న నిర్ణయం తాము కలుగ చేసుకోలేం అంటూ, సుప్రీం కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఆరు వారల తరువాత రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి, కొత్త తేదీలు ప్రకటించాలని చెప్పింది.

 

అయితే కొత్త పధకాలు ప్రకటించ కూడదు అని, కొత్త తేదీలు ప్రకటించిన తరువాత, నాలుగు వారాల ముందు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని చెప్పింది. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వచ్చిన మూడు గంటల్లోనే రాష్ట్రంలో సంచలనం పరిణామం క్రియేట్ అయ్యింది. విషయంలోకి వెళితే ఎన్నికలు లేని పరిస్థితి ఉండటంతో రాష్ట్రంలో కాలేజీలు,స్కూల్స్ జిమ్ లు స్విమ్మింగ్ ఫూల్స్ కి సెలవలు ఇచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు చాలామంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version