కమలంలో కన్ఫ్యూజన్..కానీ క్లారిటీ ఇదే.!

-

ఓ వైపు అధికార బి‌ఆర్‌ఎస్ ప్రజా బలంతో ఉంది..ఇటు కాంగ్రెస్ పార్టీకి ప్రజా బలం పెరుగుతుంది…కానీ ఆ రెండు విషయాల్లో వెనుకబడిన బి‌జే‌పి..ఎలాగైనా తెలంగాణ లో అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. పెద్దగా బలం లేకుండా అధికారం దక్కడం అనేది జరిగే పని కాదు. అందుకే పార్టీ బలం పెంచడానికి కేంద్రం పెద్దలు వ్యూహాలు మొదలుపెట్టారు. మొన్నటివరకు బి‌జే‌పి రేసులోనే ఉంది. కానీ అనూహ్యంగా కర్నాటక ఎన్నికల్లో ఓడిపోవడం, తెలంగాణలో మైనస్ అయింది.

ఇదే సమయంలో బి‌జే‌పిలో అంతర్గత పోరు మరింత ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే అధ్యక్షుడు మార్పు అంశంపై చర్చ నడుస్తుంది. ప్రస్తుతం అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్‌ని మార్చి..కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా నియమిస్తారని ఎప్పటినుంచో కథనాలు వస్తున్నాయి. జులై 3న బి‌జే‌పి మంత్రివర్గ మండలి సమావేశం తర్వాత ఈ విషయంపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఎందుకంటే తెలంగాణతో పాటు ఎన్నికలు జరుగుతున్నా మధ్యప్రదేశ్ , రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, మిజోరాం రాష్ట్రాల్లో బలం పెంచుకోవడం కోసం కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేసి..ఆయా రాష్ట్రాల నుంచి మంత్రివర్గంలోకి తీసుకోవాలని చూస్తున్నారని తెలిసింది.

ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి కూడా మరొకరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని అంటున్నారు. ఇప్పటికే కిషన్ రెడ్డి మంత్రిగా ఉన్నారు..బండిని సైతం కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తుంది. ఇక అధ్యక్ష పదవి బండికి ఇస్తారని కథనాలు వస్తున్నాయి. ఇవి కథనాలు మాత్రమే…వాస్తవం ఏంటి అనేది క్లారిటీ లేదు.

కాకపోతే జులై 8న మోదీ తెలంగాణ పర్యటన ఉంది..ఆ పర్యటనకు తాను అధ్యక్ష హోదాలో హాజరు అవ్వలేనని బండి…తన అనుచరుల దగ్గర అనడం చర్చనీయాంశంగా మారింది. అంటే బండిని అధ్యక్ష పీఠం నుంచి తొలగిస్తున్నారని తెలుస్తుంది. ఇందులో డౌట్ లేదనే చెప్పవచ్చు..కాకపోతే ఆయన్ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారా…జాతీయ పదవి ఇస్తారా? అనేది తెలియదు. మరి ఈ మార్పులు బి‌జే‌పికి ఉపయోగపడతాయో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version