భవిష్యత్తుకు గ్యారెంటీ పోయింది..తమ్ముళ్ళ ఆవేదన.!

-

ప్రజల్లో తిరగడం లేదు. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం చేయడం లేదు. లోకేష్ పాదయాత్ర లేదు. ఓట్ల వెరిఫికేషన్ లేదు. నియోజకవర్గాల్లో బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశాలు లేవు. నేతల పనితీరుపై సమీక్షా లేదు. అధికార వైసీపీపై పోరాటం లేదు. ఇప్పుడు టాపిక్ మొత్తం చంద్రబాబు అరెస్ట్, ఆయన ఎప్పుడు బయటకొస్తారనే అంశంపైనే తెలుగు తమ్ముళ్ళ పోరాటం, దృష్టి ఉంది.

ఇదే ఇప్పుడు తమ్ముళ్ళ ఆవేదన కూడా. బాబు అరెస్ట్ కాకముందు వరకు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు అన్నీ జరుగుతూ వచ్చాయి. ఆఖరికి బాబు అరెస్ట్ అయ్యేప్పుడు కూడా భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలోనే ఉన్నారు. అటు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఇటు నేతలు నియోజకవర్గ స్థాయిలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. బూత్ స్థాయి కార్యకర్తలని రెడీ చేసుకుంటున్నారు. ఇలా అన్నీ రకాలుగా టి‌డి‌పి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో బాబు అరెస్ట్ కావడంతో మొత్తం ఆగిపోయాయి. ఇప్పుడు బాబు అరెస్ట్ కు నిరసనగా తమ్ముళ్ళు గళం విప్పుతున్నారు.

ఇదంతా చూస్తుంటే దీని వెనుక జగన్ పోలిటికల్ స్కెచ్ ఉందని తమ్ముళ్ళు అనుమానిస్తున్నారు. కావాలని బాబు అరెస్ట్ చేయించి….మొత్తం సమస్యలని డైవర్ట్ చేయడమే కాకుండా, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని కూడా బంద్ చేయించారని, దీని ద్వారా జనంలో టి‌డి‌పి వాళ్ళని లేకుండా చేశారని తమ్ముళ్ళు ఆవేదన చెందుతున్నారు.

అందుకే బాబు బయటకొచ్చే వరకు ఎదురుచూడకుండా పోరాటం చేయాలని, ఇంటింటికి తిరగాలని తమ్ముళ్ళు అంటున్నారు. అయితే పరిస్తితి చూస్తే ఇప్పుడే తమ్ముళ్ళు బయట తిరిగేలా లేరు. పైగా ఏది చేసిన పోలీసులు హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టి‌డి‌పి కార్యక్రమాలు సజావుగా సాగే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version