2026 తర్వాతే మహిళ రిజర్వేషన్లు అమలు అయ్యే ఛాన్స్ ఉందని బిజెపి రాజ్య సభ ఎంపి జీవీఎల్ నరసింహ రావు కీలక ప్రకటన చేశారు. జన గణన ను 2025 లోపు పూర్తి చేయాలని మోడీ సర్కార్ అలోచన అని.. జన గణన , డీ లిమిటేషన్ తర్వాత మహిళ రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని వివరించారు. 2026 నుంచి జరిగే ఎన్నికల్లో మహిళ రిజర్వేషన్లు అమలు లోకి వచ్చే అవకాశం ఉందని.. చట్ట సభల్లో మహిళ సంఖ్య గణనీయంగా పెరగనుందన్నారు బిజెపి రాజ్య సభ ఎంపి జీవీఎల్ నరసింహ రావు.
గతంలో మహిళ రిజర్వేషన్ల బిల్లును యుపిఎ సర్కార్ బుట్ట దాఖలు చేసిందని.. గతంలో కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన మహిళ రిజర్వేషన్ల బిల్లులో అనవసర అంశాలు ఉన్నాయని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ మా బిల్లు అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలని ఫైర్ అయ్యారు బిజెపి రాజ్య సభ ఎంపి జీవీఎల్ నరసింహ రావు. సరైన సమయంలోనే మహిళ రిజర్వేషన్ల బిల్లును మోడీ సర్కార్ తీసుకువచ్చిందని పేర్కొన్నారు. యుపిఎ మహిళ రిజర్వేషన్ల బిల్లులో 5 ఏళ్లకు ఒక సారి సీట్లు మార్చాలని ఉంది…ఇలా చేస్తే మహిళ నాయకత్వం బలపడదన్నారు.