అమిత్ షా గో బ్యాక్.. ఏపీ పర్యటనలో ఉద్రిక్తత

-

అమిత్ షా గోబ్యాక్.. గోబ్యాక్.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీలో బీజేపీ నాయకులు ఎలా అడుగుపెడుతున్నారు.. అంటూ టీడీపీ నాయకులు.. బీజేపీ ప్రెసిడెంట్ అమిత్‌షా ఏపీ పర్యటనను అడ్డుకుంటున్నారు. ఆయన ఇవాళ శ్రీకాకుళంలో బస్సు యాత్ర ప్రారంభించారు. దీంతో ఆయన యాత్రకు తీవ్ర అడ్డంకులు సృష్టిస్తున్నారు టీడీపీ నాయకులు. పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే, అత‌డి అనుచ‌రుల‌ను పోలీసులు అరెస్ట్ చేసిన‌ప్ప‌టికీ.. టీడీపీ నాయ‌కులు మాత్రం బ‌స్సు యాత్ర‌ను అడ్డుకుంటూనే ఉన్నారు. దీనిపై ఏపీ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమిత్‌షా పర్యటనను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని… టీడీపీ నాయకులు అధికారం ఉంది కదా అని దౌర్జన్యానికి దిగుతున్నారని ఆగ్రహిస్తున్నారు.

బీజేపీ బస్సు యాత్ర లక్ష్యమేంటంటే..

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దాదాపు 126 సంక్షేమ పథకాల గురించి దేశ వ్యాప్తంగా ప్రచారం చేసి బీజేపీని అన్ని రాష్ర్టాల్లో బలోపేతం చేసేందుకు బీజేపీ నాయకులు సమాయత్తమవుతున్నారు. ఈనేపథ్యంలోనే ఏపీలో బస్సు యాత్రను ఇవాళ ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా పలాసలో బస్సు యాత్ర ప్రారంభమయింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆధ్వర్యంలో ప్రారంభమయిన ఈ యాత్రలో టీడీపీ నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఏపీకి కేంద్రం ఎంత సాయం చేసింది.. చంద్రబాబు అవినీతిని బయటపెట్టడం లాంటి వాటిని ప్రధాన అస్ర్తాలును ఈ యాత్రలో సంధిస్తుండటం టీడీపీ నాయకులకు నచ్చట్లేదు. అందుకే.. బీజేపీ యాత్రను అడుగడుగునా అడ్డుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version