ఆత్మహత్య దిశగా టీడీపీ .. ఇలా చేస్తే అంతేమరి !

-

2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం జరిగింది. త్రుటిలో ప్రతిపక్షం కూడా కోల్పోయే విధంగా ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష పార్టీ గా వ్యవహరిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీని ఆత్మహత్య చేసుకునే దిశగా తీసుకెళ్తున్నయి అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

చాలా విషయాలలో ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకురావాలని అత్యుత్సాహంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు ఆ పార్టీని కొంప ముంచుతున్నాయి అంటున్నారు. ఇంగ్లీష్ మీడియం విధానంలో అదేవిధంగా రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు చూపిన అత్యుత్సాహం టిడిపి పార్టీ ని పతనం దిశగా తీసుకెళ్లడం జరిగిందని కుట్రపూరితంగా వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుని టిడిపి ఎమ్మెల్సీలు శాసనమండలిలో తమకు బలం లేకుండా చేసుకున్నారని ఏకంగా మండలే లేకుండా చేసుకున్నారని అదే తరుణంలో రాజధాని అమరావతి విషయంలో కేవలం భూముల గురించి ప్రశ్నించకుండా అమరావతి ప్రాంతానికే నాయకుడిగా చంద్రబాబు వ్యవహరించడం జరిగింది.

 

దీంతో రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఆ ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకత పార్టీగా మారిపోయిందని చంద్రబాబు అత్యుత్సాహం వల్లే టిడిపి ఆత్మహత్య దిశగా ఉనికిని కోల్పోతుందని ఇలా చేస్తే పార్టీ త్వరలో క్లోజ్ అయిపోవటం గ్యారెంటీ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version