ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడానికి గాను… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సరికొత్త వ్యూహాలు సిద్దం చేస్తూ దూసుకుపోతున్నారు. తెలుగుదేశం నుంచి వైసీపీలోకి రావడానికి సిద్దంగా ఉన్న కీలక నేతలను వైసీపీలో చేర్చుకుంటుంది అధికార పార్టీ.
ఇప్పటికే కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందినకీలక నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్దమయ్యారు. ఇక ఇప్పుడు పులివెందులలో వైఎస్ జగన్ పై ఎమ్మెల్యే గా పోటీ చేసిన సతీష్ రెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్దమయ్యారు. ఆయన నాలుగు సార్లు జగన్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నెల 13 న ఆయన వైసీపీలో చేరనున్నారు. జగన్ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
దీనితో ఒక్కసారిగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అధికార పార్టీకి పులివెందుల నియోజకవర్గంలో అదనపు బలం వచ్చినట్టు అయింది. ఇప్పటికే జగన్ ఇక్కడ తిరుగులేని నేతగా ఉన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా జగన్ పై పోటీ చేసి భారీ తేడా తో ఓటమి పాలయ్యారు. జిల్లాలో ఆయన పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఇప్పుడు కీలక సమయంలో పార్టీ మారడంతో టీడీపీ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి.