టీడీపీ-జనసేనల పొత్తు లెక్కలు… భయపడుతున్న తమ్ముళ్ళు?

-

ఏదేమైనా ఏపీలో టీడీపీ-జనసేన పార్టీల పొత్తు మాత్రం ఖాయమయ్యేలా ఉంది. ఆ రెండు పార్టీలు కలవకపోతే వైసీపీని ఎదురుకోవడం అంత సులువు కాదని అర్ధమైపోతుంది. టీడీపీకి సింగిల్‌గా వైసీపీకి చెక్ పెట్టే బలం కనిపించడం లేదు. పైగా జనసేన విడిగా పోటీ చేస్తే…మరింత నష్టం జరిగే ఛాన్స్ ఉంది. జనసేన వల్ల ఓట్లు చీలిపోయి టీడీపీకి డ్యామేజ్, వైసీపీకి లాభం జరుగుతుంది. గత ఎన్నికల్లోనే సీన్ కనిపించింది. అలా అని జనసేన సింగిల్‌గా పోటీ చేస్తే….ఒకటి, రెండు సీట్లు మాత్రమే గెలుచుకోగలదు. కాబట్టి ఆ రెండు పార్టీలు ఏకమవ్వడానికి సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది.

tdp-janasena

ఇప్పటికే ఆ రెండు పార్టీల మధ్య పొత్తుల గురించి అంతర్గత చర్చలు కూడా నడుస్తున్నాయని తెలుస్తోంది. జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలనే విషయంపై నేతలు చర్చిస్తున్నారని సమాచారం. ఇదే క్రమంలో జనసేన 40 అసెంబ్లీ, 6 పార్లమెంట్ సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. కానీ టీడీపీ మాత్రం అన్నీ సీట్లు ఇవ్వడానికి సిద్ధం లేదని తెలుస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చింది ఒక సీటు మాత్రమే…అలాగే నాలుగైదు నియోజకవర్గాల్లో రెండోస్థానంలో నిలిచింది. అలాంటప్పుడు 40 సీట్లు ఎలా ఇస్తామనేది తమ్ముళ్ళ వాదనగా ఉందని తెలుస్తోంది.

అయితే 25 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు ఇవ్వడానికి టీడీపీ రెడీగా ఉందని తెలుస్తోంది. దీనికి జనసేన ఒప్పుకోవడం లేదని సమాచారం. ఇక ఈ పొత్తుల లెక్కలు ఇలాగే కంటిన్యూ అయ్యేలా ఉన్నాయి. కాకపోతే పొత్తు మాత్రం ఫిక్స్ అయితే కొందరు తమ్ముళ్ళు సీట్లు మాత్రం త్యాగం చేయక తప్పదు. ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో టీడీపీకి నాయకులు ఉన్నారు.

అలాంటప్పుడు జనసేనకు ఇందులో కొన్ని సీట్లు ఇవ్వాలి..అప్పుడు కొందరు టీడీపీ నేతలు సీట్లు త్యాగం చేయాలి. అయితే ఏ సీటు త్యాగం చేయాలో అని ఇప్పుడు తమ్ముళ్ళు భయపడే పరిస్తితి. మరి ఎవరి సీటు ఉంటుందో..ఎవరి సీటు పోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version