“మనలోకం ప్రత్యేకం”: టీడీపీ తోలుబొమ్మలాట కబుర్లు!

-

బాగా చదువుతూ మంచి మార్కులతో పాసైన తన కొడుకుని చూసిన తండ్రి… వీడివన్నీ నా పోలికలే అన్నాడట తన భార్యతో! అదే కొడుకు తర్వాత ఏడాది ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యేసరికి… వీడివన్నీ వీడి మేనమామ పోలికలు అన్నాడంట! అలా ఉంది ఏపీ టీడీపీ నేతల మాటల తీరు! అవసరం.. అవకాశం ఎలాగైనా మాట్లాడిస్తుంది అనడానికి తాజాగా ఏపీ టీడీపీ నేతలు చెబుతున్న మాటలే నిదర్శనం అనే విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. అంతా బాగా ఉంటే… అధికారులకు ఏమాత్రం క్రెడిట్ ఇవ్వకుండా, పెద్ద పెద్ద ఫోటోలతో పేపర్లలో ఫోటోలు వేయించుకునే నాయకులు.. ఏదైనా సమస్య వస్తే మాత్రం అదంతా అధికారుల తప్పు అని వారిని మాత్రమే బలిపశువులను చేసే ఆలోచనలకు తెరలేపుతున్నారు.

అచ్చెన్నాయుడి అరెస్టు అనంతరం.. తప్పు జరగలేదని ఒక్క టీడీపీ నేతా చెప్పలేదు సరికదా… తప్పంతా అధికారులదే తప్ప అచ్చెన్నది కాదనే వింత వాదనకు తెరలేపారు! ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమేయం లేకుండానే మంత్రి కథ మొత్తం నడిపారని వైకాపా నాయకులు ఆరోపిస్తుంటే… అచ్చెన్నా ప్రమోయం ఏమీ లేదు ఒక్క లెటర్ రాయడం తప్ప అని సమర్ధిస్తున్నారు టీడీపీ నేతలు. ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబే అలా మాట్లాడుతున్నారు.. మాజీ మంత్రిని అయిన తాను మాత్రం మాట్లాడితే తప్పా అనుకున్నారో ఏమో కానీ… మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా… ఈఎస్ఐ స్కాం విషయంలో అధికారులదే బాధ్యత కావాలి కానీ మంత్రులకు ఏం సంబంధం అని అంటున్నారు. ఈఎస్ఐ స్కాములకు డైరెక్టర్, డాక్టర్లు బాధ్యత వహిస్తారు తప్ప మంత్రులు కానే కాదని తీర్పు ఇచ్చేస్తున్నారు.

ప్రస్తుతం అచ్చెన్న అరెస్టు అనంతరం టీడీపీ నేతలు చెబుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే… మంత్రులు అనబడేవారు అధికారుల చేతిలో తోలుబొమ్మలు, వారు ఎలా ఆడిస్తే అలా ఆడాము తప్ప మాకేమీ సంబందం లేదన్నట్లుంది!! ఇఎస్ఐ స్కాం విషయం తీసుకుంటే ఫలానా సంస్థకు ఇవ్వాలని అచ్చెన్నాయుడు నాటి మంత్రి హోదాలో రాసిన లెటర్ ఏసీబీ అధికారులు చూపిస్తున్నా కూడా… అలాంటి లెటర్స్ ఎన్ని రాసినా అధికారులు చెక్ చేసుకోవాలి తప్ప మంత్రిని బలిచేయకూడదు అనేది వారి లాజిక్!! సరే… అయ్యన్న చెప్పినట్లే అధికారులదే తప్పు అని కాసేపు అనుకుంటే… సిఫార్స్ చేసి ఒత్తిడి తెచ్చిన మంత్రి కూడా బాధ్యుడు అవుతాడు కదా! దానికి ఏసీబీ అధికారులు సాక్ష్యాలు చూపిస్తున్నారు కదా!

సపోజ్.. ఫర్ సపోజ్.. అధికారులు ఏ లెటర్స్ ఇచ్చారో కూడా తెలియకుండా గుడ్డిగా సంతకాలు పెట్టేసే అంత అసమర్ధులను చంద్రబాబు మంత్రులుగా చేశారనుకోవాలా? టెండర్ కి నామినేషన్ ప్రక్రియకు తేడా తెలియని దద్దమ్మలను కేబినెట్ లో కూర్చోబెట్టి… వారి చేతుల్లో ప్రజల భవిష్యత్తును పెట్టారని భావించాలా? అలాంటివారు మంత్రులుగా ఉంటేనే ముఖ్యమంత్రిగా తన ఆటలు, లోకేష్ ఆటలు సాగుతాయని అభిప్రాయపడ్డారని నమ్మాలా? ఏదైనా ఒక శాఖలో ఒక పని జరిగితే.. అది మంచైనా, చెడైనా అధికారులకు మంత్రికి సమిష్టి బాధ్యత ఉంటుందనే చిన్న విషయం కూడా జనాలకు తెలియదులే అన్నట్లుగా ఉంది!! సరే తీర్పు ఏదైనా కానివ్వండి, ఎలా అయినా రానివ్వండి… ఇలాంటి ఓడమల్లాన్న – బోడి మల్లన్న మాటలు చూసాక అయినా అధికారులకు కనువిప్పు అయితే అంతే చాలు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version