టీడీపీలో డబ్బారాయుళ్ళు… ఇలా ఉన్నారేంటి స్వామి…!

-

ఏదో సినిమాలో మనమే డబ్బారాయుళ్లం అనుకుంటే మనకంటే డబ్బారాయుళ్ళు లాగా ఉన్నారని తనికెళ్ళ భరణి చెప్పిన డైలాగ్..ఇప్పుడు టీడీపీ నేతలకు బాగా సరిపోతుందనే చెప్పాలి. మామూలుగానే టీడీపీ అధినేత చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకోవడంలో ముందుంటారు. మాటకు మెదిలితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ళు సీఎం, 13 ఏళ్ళు అపోజిషన్ అని డైలాగులు వేస్తూ ఉంటారు. పైగా ఎప్పటికప్పుడు అదిగో వైసీపీ పని అయిపోయింది… టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుందని మాట్లాడుతుంటారు. ఇలా బాబు ఎప్పటికప్పుడు డబ్బా కొడుతూనే ఉంటారు.

TDP Party | తెలుగుదేశం పార్టీ

ఇక ఆవు చేలో మేస్తే దూడ గట్టిని మేస్తుందా? అన్నట్లుగా బాబు డబ్బా కొడితే… అంతకంటే ఎక్కువగా తాము డబ్బా కొడతామనే విధంగా టీడీపీ నేతల వైఖరి ఉంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై తమ్ముళ్ళు తెగ పోరాటం చేస్తున్నారు. సరే పోరాటం చేయడంలో తప్పు లేదు గానీ, అసలు వైసీపీని ప్రజలు చీదిరించుకుంటున్నారని, వైసీపీ చాప్టర్ క్లోజ్ అని, కాలగర్భంలో కలిసిపోతుందని రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అని మాట్లాడుతున్నారు.

తాజాగా కుప్పంతో పాటు పలు మున్సిపాలిటీల్లో, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. కాకపోతే కొన్ని చోట్ల టీడీపీ సత్తా చాటింది. కానీ అది వైసీపీని మించి కాదు. అయినా సరే అదిగో మార్పు మొదలైపోయింది.. జనం వైసీపీని తిరస్కరిస్తున్నారు… టీడీపీ వైపు వచ్చేస్తున్నారని డబ్బా కొట్టేస్తున్నారు.

పైగా ఏడు నెలల క్రితం జరిగిన ఎన్నికల కంటే ఇప్పుడు తమకు ఓట్ల శాతం పెరిగిందని హడావిడి చేస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 30 శాతం ఓట్లు వస్తే.. ఇప్పుడు 43 శాతం ఓట్లు వచ్చాయని అంటున్నారు. అయితే ఎంత శాతం ఏమో గానీ, గతం కంటే ఇప్పుడు టీడీపీకి ఓట్లు పెరిగిన మాట వాస్తవమే. కాకపోతే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ..75 మున్సిపాలిటీలు 12 కార్పొరేషన్‌ల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు 12 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు చాలా తక్కువ స్థానాల్లో పోలింగ్ శాతం ఎక్కువ వస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం ఉన్నట్లు తమ్ముళ్ళు ఫీల్ అయిపోతున్నారు. నిజాలు చెప్పకుండా అబ్బో మేమే తోపులం అంటున్నారు. మరీ తమ్ముళ్ళు ఇంత డబ్బారాయుళ్ళు అనుకోలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version