ఎవరూ కూడా ఫోరైడ్ బారిన పడకూడదు అని, ఆదివాసీలు వర్షపు నీరు తాగి మరణించకూడదు అని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మిషన్ భగీరథ పథకం కి శ్రీకారం చుట్టారని ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణా బడ్జెట్ ని ఆయన సభలో ప్రవేశ పెడుతున్నారు. అందరికి ప్రభుత్వం అండగా నిలబడాలని ఆసరా పించన్ లను అందించామని హరీష్ రావు పేర్కొన్నారు. దాదాపు 39 లక్షల మంది ఆసరా పించన్ లు తీసుకుంటున్నారని అన్నారు.
వెనుకబడిన వర్గాల కోసం తెలంగాణా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు ప్రవేశ పెట్టిందని మంత్రి అన్నారు. సంఘాలు, ఆదివాసిలను గ్రామ పంచాయితీలు గా మార్చమని హరీష్ రావు పేర్కొన్నారు. ఆదివాసీల ఆరాధ్య దైవం అయిన సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఎస్సీఎస్టీల మాదిరిగానే మైనార్టీలు కూడా ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.
మౌజాం లకు నెలకు 5 వేల ఆర్ధిక సహాయం చేస్తున్నామని హరీష్ రావు వివరించారు. మైనార్టీ విద్యార్ధుల కోసం 224 గురుకుల విద్యాలయాలు నెలకొల్పామని అన్నారు. షాదీ ముబారక్ ద్వారా ఇప్పటి వరకు ఒక లక్షా 41 వేల మంది లబ్ది పొందారని ఆహ్రీష్ పేర్కొన్నారు. ఆసరా పెన్షన్ ల కోసం 11 వేల నిధులను కేటాయించారు. గొల్ల కురుముల ఆదాయం పెంచాలని మాంసం ఉత్పత్తిని పెంచాలని ఎన్నడు లేని విధంగా గొర్రెల పంపిణి చేసామని అన్నారు.