టెక్కిలి ప్రజలకు అచ్చెన్న అవసరం లేదిక!

-

ప్రస్తుతం వైకాపా అధినాయకత్వం అచ్చెన్నాయుడిని గట్టిగానే టార్గెట్ చేసినట్లుంది! ఇప్పటికే అచ్చెన్నను ఇ.ఎస్.ఐ. కేసు వ్యవహారంతో మానసింకంగా బలమైన దెబ్బకొట్టారని కామెంట్లు వినిపిస్తున్నాయి. అవినీతి అక్రమాలకు పాల్పడుకుంటూపోతే చూస్తూ పోవడానికి ఇక్కడున్నది బాబు కాదు జగన్ అని చెప్పకనే చెబుతున్నారు ఏసీబీ అధికారులు! ఈ పరిస్థితుల్లో రాజకీయంగా కూడా శ్రీకాకుళం, ముఖ్యంగా టెక్కిలిలో కూడా అచ్చెన్న హవాను ఆమోస్ట్ కట్ చేసేస్తుంది అధికార పార్టీ!

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కింజరపు కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత గురించి తెలిసిందే. సుమారు నాలుగు దశాబ్దాలుగా ఆ జిల్లాలో రాజకీయాలను వారు శాసిస్తున్నారు. ఇదే క్రమంలో నేడో రేపో అచ్చెన్న ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కూడా అవుతారని టాక్ నడుస్తోంది.. లోకేష్ తోక అడ్డుపెట్టకపోతే ఈపాటికే ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసేసేవారని అంటున్నారు! ఆ సంగతులు అలా ఉంటే… టెక్కిలిలో అచ్చెన్న అవసరం ప్రజలకు ఏ రూపంలోనూ అవసరం లేకుండా చేస్తున్నారంట వైకాపా నేతలు!

అందులో భాగంగా… అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గం ఇంచార్జి గా సీనియర్ నేత దువ్వాడ శ్రీనివాస్ ని నియమించి.. ఆయనను అక్కడ అనధికార ఎమ్మెల్యేగా మార్చేశారని టాక్ నడుస్తుంది. దీంతో టెక్కిలి ప్రజలు అచ్చెన్న ఇంటివైపు చూడాల్సిన అవసరం రావడం లేదంట. ఇదే క్రమంలో… గత ఏడాది ఎన్నికల్లో అచ్చెన్నాయుడు మీద ఓడిన పేరాడ తిలక్ ని కాళింగ కార్పొరేషన్ చైర్మన్ని చేసి బరిలోకి వదిలారు.!

దీంతో.. అటు కులం, ఇటు నియోజకవర్గం, ఇటు జిల్లా స్థాయిలో కూడా ఇకపై కింజరపు కుటుంబానికి పాతినిధ్యం నిల్ అయ్యే పరిస్థితి అన్నమాట! మరి ఈ సమయంలో అచ్చెన్న టీడీపీ ఏపీ అధ్యక్షుడు అయితే గతంలో ఉన్న ఊపు, ఉత్సాహం అటు ఆయనలోను, ఇటు ప్రజల్లోనూ ఉంటుందా అనేది వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Exit mobile version