కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం లో పోలీసులుల అత్యుత్సాహం వివాదాస్పదం అయింది. దేవీ నవరాత్రులో భాగంగా చందర్లపాడు మండలం లక్మీ పురం లొ వీధి లో అమ్మవారి విగ్రహం ఏర్పటు చేసుకోని పూజలను గ్రామస్తులు నిర్వహిస్తున్నారు. పందిళ్ళ కు అనుమతి లేదంటూ రెండు రోజు తొలగించారు. పూజ చేసుకుంటున్న అమ్మవారిని తొలగించడంతో తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఈ వివాదం పై శివ స్వామీజీ లక్మీపురంలో పర్యటించారు. ఇక పోలీసులకు తీరుకి నిరసనగా… గ్రామం లోకి వచ్చిన విశ్వ హిందు పరిషత్ సభ్యులను గ్రామంలో నుంచి వెళ్ళకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. మీరు గ్రామం నుంచి వెళితే తమ న్యాయం జరగదని గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. పందిళ్ళలో స్వామిజీ కూర్చొని నిరసన వ్యక్తం చేసారు. పోలీసుల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.