తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం

-

నాలుగవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మాటలయుద్దం మధ్య నడిచింది. ముందుగా గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాద తీర్మానంను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రతిపాదించారు. దీనిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి బలపరిచారు. అలాగే శాసనమండలిలో కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్ తెలిపారు.

బీఅర్ఎస్ పార్టీ తరపున గవర్నర్ ప్రసంగంపై మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఅర్‌ ముందుగా ధన్యవాదాలు చెప్తూ గవర్నర్ దారుణమైన ప్రసంగం విన్నాక రాష్ట్రం ఎలా ఉండబోతుందో అర్థం అవుతోందన్నారు కామెంట్ చేశారు. నక్క మోసం చేయనని, పులి మాంసం తినను అని చెప్పినట్టు ఉందని వ్యాఖ్యానించారు. తాము ఎక్కడ ఉన్నా ప్రజా పక్షమే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో త్రాగు, సాగు నీటితో పాటూ కరెంట్ కి కూడా దిక్కు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉండేదో గతాన్ని నెమరువేసుకోవాలని సూచించారు.

నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ తప్ప ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.ఇప్పటికె రెండు గ్యారంటీలను అమలు చేశామని బుకాయించినా అది ప్రజలను మోసం చేసినట్టేనాని అన్నారు. కేవలం పావలా వంతు మాత్రమే అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఐటీ అంటే ఐటీఐఆర్ అంటే కాంగ్రెస్ కి అర్థం తెలియదని చెప్తూ తెలంగాణలో నికర ఆస్తులు పెంచామని అన్నారు.ఢిల్లీ నుంచి నామినేట్ అయిన సీఎం కి ఇవన్నీ తెలియదని విమర్శించారు. రేవంత్ అసలు ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదని,ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ లో వచ్చాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ని చంద్రశేఖర్ రావు అని మాట్లాడినట్టుగా తాను మాట్లాడబోనని చెప్తు రేవంత్ రెడ్డి గారు అనే సంబోధిస్థానని స్పష్టం చేశారు.

కేటీఆర్ మాటలపై అటు కాంగ్రెస్ మంత్రులు కూడా స్పందించారు.కేటీర్ మాటలను తిప్పికొట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆ తరువాత తెలంగాణ డిప్యూడీ సీఎం, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడారు. మొదటి రోజే ప్రభుత్వంపై మాటల దాడి చేస్తారా అని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక సూచనలు చేస్తే స్వీకరిస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ది మొత్తం జరిగిందని కేటీఆర్ చెప్పడాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ హయాంలో ఏ ప్రాంతానికి నీళ్లు రాలేదో చెప్పాలని ప్రశ్నించారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విధ్వంసం జరిగిందని విమర్శించారు. మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని అప్పగిస్తే రూ. 5 లక్షల కోట్ల అప్పుల తెచ్చి కాంగ్రెస్ కి అప్పగించారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version