తెలంగాణ సీఎం భట్టి కావాల్సింది..కానీ చీమలు పెట్టిన పుట్టను పాములు ఆక్రమించినట్లు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి దూరారని చురకలు అంటించారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది అంటున్నారు…రాజకీయ దివాలా కోరుతనం తో మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. అప్పుల గురించి మాట్లాడతారు. …కానీ ఆస్తుల గురించి మాట్లడారన్నారు.
అటు CM రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సంచలన వాక్యాలు చేశారు. ”ఆయన తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి” అని ఎద్దేవా చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని, హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ రిప్లై ఇచ్చారు. తనను ఎన్ఆర్ఐ అని రేవంత్ కామెంట్ చేశారని…. ఎన్నారైని తీసుకొచ్చి పార్టీ అధ్యక్షురాలిని చేసింది ఏ పార్టీనో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు 56 వేల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పడం అబద్ధం అంటూ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్.