ఒంటరి పోరాటం.. గెలిచేది ఎవరో?

-

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. నవంబర్ 30న ఎన్నికలు..డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయి. అయితే తెలంగాణలో ఎన్నికలు ఈసారి ఆసక్తికరంగా  ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో ఈసారి అన్ని రాజకీయ పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాయి.  ప్రధాన పార్టీలైనా బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపితో పాటు బిఎస్పి, టిడిపి, వామపక్షాలు, జనసేన, వైయస్సార్టిపి, టీజేఎస్   అన్ని పార్టీలు ఒంటరిగానే బరిలోకి పోటీ చేసే ఛాన్స్ ఉంది.

అయితే కాంగ్రెస్ తో కమ్యూనిస్టులు పొత్తు ఉంటుందని ప్రచారం ఉంది..కానీ అది వర్కౌట్ అయ్యేలా లేదు. అటు కోదండరాం సైతం..కాంగ్రెస్ తో పొత్తు కోసం చూస్తున్నారని తెలిసింది. ఇది కూడా జరిగేలా లేదు. దాదాపు అన్నీ పార్టీలు ఒంటరిగానే బరిలో ఉండవచ్చు. అయితే ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని బిఆర్ఎస్ పట్టుదలతో ఉంది. బిఆర్ఎస్ ను ఈసారి ఓడించి ఈసారైనా అధికారాన్ని చేపట్టాలని కాంగ్రెస్, బిజెపి దృఢ సంకల్పంతో ఉన్నాయి. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తాయని బిఆర్ఎస్ ధీమాతో ఉంది.

ప్రభుత్వంపై వ్యతిరేకత, నేతల అవినీతి , నాయకత్వం మార్పు ఇవి తమకు కలిసొస్తాయని ప్రతిపక్ష పార్టీలు  అనుకుంటున్నాయి. ఇదే సమయంలో మిగతా పార్టీలు తమ బలం చాటుకోవాలని చూస్తున్నాయి. అయితే ఇలా రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తే ఎన్నికల్లో ఓట్లు చీలే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

పోటీ చేసిన ప్రతి పార్టీకి కొన్ని ఓట్లు కచ్చితంగా పడతాయి. ఆ చీలిక వలన ఓట్లు ఎక్కువశాతం కాంగ్రెస్ కు నష్టాన్ని చేకూరుస్తాయని కాంగ్రెస్ నేతలతో పాటు రాజకీయ వర్గాల వారు కూడా అంటున్నారు.

అంటే సి‌పి‌ఐ, సి‌పి‌ఎం, బి‌ఎస్‌పి, వైఎస్సార్టీపీ పార్టీలతో కాంగ్రెస్‌కు నష్టమని అంచనా. అటు టి‌డి‌పి‌, జనసేనలతో బి‌ఆర్‌ఎస్‌, బి‌జే‌పికి నష్టమని అంటున్నారు. చూడాలి మరి ఓట్ల చీలిక చివరికి ఎవరికి నష్టం చేస్తుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version