తెలంగాణ ప్రజలపై హేళనగా మాట్లాడిని కేంద్రమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదు: నిరంజన్ రెడ్డి

-

తెలంగాణ పరిస్థితుల గురించి వివరిస్తే కేంద్ర మంత్రి హేళనగా మాట్లాడారని… మాకు సంబంధం లేదని ధాన్యం కాదు, బియ్యమే కావాలని కేంద్రమంత్రి అన్నారని… మీ ప్రజలకు ఉప్పుడు బియ్యం అలవాటు చేయాలని కేంద్రమంత్రి హేళనగా మాట్లాడారని… ఈ అవమానానికి వారు మూల్యం చెల్లించుకోక తప్పదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యాపారపరంగా ఆలోచిస్తుందని… ఇది శ్రేయో రాజ్యం లక్షణం కాదని హితవు పలికారు. పంజాబ్ కు మించి తెలంగాణ రైతులు వడ్లను పండించారని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రయత్నంతోనే తెలంగాణ రైతులు బాగుపడ్డారని… కరెంట్ లో, నీళ్లలో కేంద్రం పాత్ర లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఢిల్లీకి తీసుకువచ్చిన పాపానికి ఒడిగట్టింది కేంద్ర ప్రభుత్వం అని విమర్శించారు. రైతులు పంట పండిచే వారే కాదని… రైతులకు కోపం వచ్చినప్పుడు కేంద్రానికి చెమటలు పట్టించడం కూడా తెలుసు అంటూ వార్నింగ్ ఇచ్చారు. రైతుల ఉద్యమానికి తలొగ్గి ప్రధాని చెంపలేసుకుని రైతులకు క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు నిరంజన్ రెడ్డి. కేంద్రం వాళ్ల ప్రభుత్వాలు లేని రాష్ట్రాలపై వివక్ష చూపిస్తున్నారంటూ విమర్శించారు. కేంద్రం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని… కేంద్రానికి నూకలు తినిపించే రోజులు దగ్గరపడ్డాయని నిరంజన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version