తనతోనే ఉంటుంది అనుకున్న ఆ పార్టీ చంద్రబాబు కి అతిపెద్ద శత్రువు అయ్యింది !

-

చంద్రబాబు నాయుడికి రాజకీయంగా 2019 ఎన్నికల రిజల్ట్ నుండి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇన్సైడర్ ట్రేడింగ్ తరువాత చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి మొత్తం ఇటీవల బయట పడుతున్న తరుణంలో 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు ఒంటరయిపోయింది. జగన్ అధికారంలోకి వచ్చాక బాబు హయాంలో జరిగిన అవినీతిపై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రత్యేకంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఆధారాలతో సహా విచారణ కోసం సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

దీంతో చంద్రబాబు గుండెళ్లో దడ పుట్టిస్తుంటే.. మరోవైపు ఈఎస్ఐ స్కామ్ బయటపడటం తో 2014 చంద్రబాబు ప్రభుత్వం పై మరింత బురద పడినట్లయింది. తాజాగా బయటపడినా ఈఎస్ఐ స్కామ్ లో ప్రముఖ మంత్రి అచ్చెన్నాయుడు పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై కూడా విచారణ చేపట్టాలని ఈ విషయంలో వైసిపి డిమాండ్ చేస్తున్న తరుణంలో బిజెపి కూడా రీసెంట్ గా అదే డిమాండ్ చేయడం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.

 

దీంతో ముందు నుండి రాజకీయాలలో తనకి అండదండగా ఉన్న బిజెపి కూడా తాజాగా శత్రువు అయ్యింది. దీంతో చంద్రబాబుకి ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే చంద్రబాబు తాను తీసిన గోతిలో తానే పడ్డారని చేసిన అవినీతి మరియు రాజకీయ స్వార్థం కోసం మోడీపై దేశవ్యాప్తంగా వ్యతిరేకంగా మాట్లాడటంతో రాజకీయంగా చంద్రబాబు కొంప మునిగిపోయినట్లే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version