బెస్ట్ సిఎంగా జగన్ ర్యాంక్ ఎంతో తెలుసా…?

-

ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలన ఆధారంగా ఇండియా టుడే చేపట్టిన ఒక సర్వేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివైఎస్ జగన్ బెస్ట్ సిఎం గా నాలుగో స్థానం సాధించారు. అత్యుత్తమ పనితీరు కనబరిచిన అతికొద్ది మంది ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ చోటు సంపాదించి టాప్5 లో నిలిచారు. మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరిట జనవరిలో జాతీయ స్థాయిలో ఇండియా టుడే ఈ సర్వే నిర్వహించింది.

సిఎం గా బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ కాలంలోనే జగన్ బెస్ట్ పెర్ఫామింగ్ సిఎంగా నిలిచారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌ 13% తో మొదటి స్థానంలో నిలిచారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్ 11 శాతంతో రెండో స్థానంలో నిలవగా మూడో స్థానంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ 10 శాతంతో నిలిచారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, జగన్ ఇద్దరు 7 శాతంతో నాలుగో స్థానంలో ఉన్నారు.

6% తో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆరో స్థానంలో ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని 4% తో ఏదో స్థానంలో ఉండగా, 3% తో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ 7 స్థానంలో నిలిచారు. దీనిపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పని తీరుకి ఇది నిదర్శనం అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version