ఈటల రాజేందర్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే.. అన్ని పార్టీలూ తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ఈ విషయంలో తన పాత్ర ఏంటో స్పష్టంగా చెప్పింది. అయితే కాంగ్రెస్ మాత్రం ఎటూ తేల్చుకోకుండా ఉంటోంది. పార్టీ చీఫ్ అయిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు.
ఈటలను ఎలాగైనా పార్టీలోకి లాగేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం సైలెంట్‌గా ఎందుకు ఉంటోందో అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి మాత్రమే ఈటల విషయంపై స్పందించారు.
రేవంత్ రెడ్డి అయితే తమ పార్టీలోకి రావాలని డైరెక్టుగానే ఆహ్వానించారు. కానీ ఉత్తమ్ మాత్రం ఈ విషయంపై నోరు మెదపట్లేదు. ఎందుకంటే హుజూరాబాద్ లో తన బంధువు అయిన పాడి కౌశిక్‌రెడ్డికి పోటీగా ఈటల ఉంటాడని ఉత్తమ్ సైలెంట్ గా ఉంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఈటల కూడా కాంగ్రెస్ అగ్ర నేతలన ఇప్పటి వరకు కలవలేదు. కేవలం భట్టి విక్రమార్క, కొండా దంపతులతో మాత్రమే భేటీ అయ్యారు. మరి కాంగ్రెస్ ముందు, ముందు ఏమైనా స్పందిస్తుందో చూడాలి.