ఆ రాష్ట్రంలో వలస కూలీలకు కండోమ్స్ పంపిణీ చేస్తున్న ప్రభుత్వం.. ?

-

 

కరోనా నేపధ్యంలో వలస కూలీల బ్రతుకులు కష్టాల్లో పడటంతో వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహయక చర్యలు చేపట్టాయన్న విషయం తెలిసిందే.. అయితే వారికి సహాయంగా ఇంటి సరకులు, ఇతరమైన వస్తువులు, కొంత నగదు ఇచ్చి ఆదుకుంటున్నారు.. ఇంతవరకు బాగానే ఉంది ఈ సహయం అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నదే.. కానీ బీహార్ ప్రభుత్వం మాత్రం వలస కూలీలకు కండోమ్స్‌ను కూడా పంపిణీ చేస్తోంది..

అదేంటి ఈ కరోనా టైంలో కండోమ్స్ పంపిణి ఏంటని ఆశ్చర్యపోకండి.. ఈ విషయంలో స్టేట్‌ హెల్త్‌ సొసైటీ ఫ్యామిలీ ప్లానింగ్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సమయంలో అవాంఛిత గర్భాలు పెరిగగా ముందు జాగ్రత్తగా కండోమ్ లు పంపిణీ చేస్తున్నామని అంతే కాదు ఇలాంటి విపత్కర పరిస్దితుల్లో గర్భం వస్తే పుట్టబోయేబిడ్డ ఆరోగ్యానికి కూడా అంత మంచిదికాదని తెలిపారు..

 

ఇక ఇది పూర్తిగా కుటుంబ నియంత్రణ చర్య అని కోవిడ్‌-19 తో దీనికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.. ఇకపోతే ఈ రాష్ట్రానికి చేరుకున్న వలస కార్మికులకు 14 రోజుల క్వారంటైన్‌ ముగిసిన అనంతరం తిరిగి హోం క్వారంటైన్‌కు తరలించేముందు అధికారులు వీరికి కండోమ్‌లను ఉచితంగా అందజేస్తూ, కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.. ఏది ఏమైనా ఇంత వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పనిని, బీహార్ ప్రభుత్వం చేయడం మరి వింతగా, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version