ఇప్పటి వరకు ఏపీలో వైసీపీ కి ఎదురు లేకుండా పోతోంది. కానీ ఆ పార్టీకి ఒకే ఒక్క చోట కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అదే శాసనమండలి. ఇందులో మొన్నటి వరకు టీడీపీకి బలం ఎక్కువగా ఉండటంతో వైసీపీకి నానా ఇబ్బందులు వచ్చాయి. ప్రభుత్వం ఏ చట్టం చేసినా మండలిలో నెగ్గుకురావడం కష్టమైంది. కానీ ఇప్పుడు ఆ సమీకరణాలు మారుతున్నాయి.
టీడీపీ ఎమ్మెల్సీల పదవి గడువు ముగియడంతో ఆ బలం వైసీపీకి పెరుగుతోంది. ఈరోజు ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీలు తమ పదవుల గడువు అయిపోవడంతో వారు రిటైర్ అవుతున్నారు. అలాగే వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా ఈ రోజు రిటైర్ అవుతున్నారు.
ఇంకోవైపు వైసీపీకి గవర్నర్ కోటాలో ఇటీవల ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీలు అందుబాటులోకి వస్తున్నారు. దీంతో శాసనమండలిలో టీడీపీ సంఖ్య 22 నుంచి 15కు తగ్గిపోతోంది. ఇంకోవైపు వైసీపీ బలం విపరీతంగా పుంజుకుంటోంది. నలుగురి రాకతో వైసీపీ బలం 17 నుంచి 21కి పెరుగుతోంది. అలాగే ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలను త్వరలోనే ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇక దాంతో మండలిలో వైసీపీకి ఎదురే లేకుండో పోనుంది.