ప్రమాణస్వీకారానికి ముందే రెచ్చిపోతున్న టీడీపీ శ్రేణులు

-

ఏపీలో ఈనెల 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అత్యధిక సీట్లు గెలిచిన కూటమి నేతలు ప్రభుత్వాని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.ఇంతలోనే రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ దాడులకు పాల్పడుతోంది.ఒకటి రెండు చోట్లా కాదు ఏపీ వ్యాప్తంగా ఈ సంఘటనలు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల ఆస్తుల విధ్వంసానికి తెలుగుతమ్ముళ్లు పాల్పడుతున్నారు.దీంతో ఎక్కడ చూసినా భయానక వాతావరణం నెలకొంది.దీనిపై పలువురు నేతలు గవర్నర్ కి ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు లేకపోవడం గమనార్హం.

ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అరాచక చేష్టలకు దిగింది.ఫలితాలు రాగానే వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ వద్ద దివంగత నేత పేరు ని ధ్వంసం చేశారు. అనంతపురంలో వైస్సార్ బొమ్మ విధ్వంసానికి పాల్పడ్డారు. విశాఖ ఋషికొండ పై ఉన్న ప్రభుత్వ భవనాలపై టీడీపీ జెండాలు నాటారు. ఏలూరులో వైసీపీ సానుభూతిపరుడి దుకాణo పై దాడి చేశారు.నూజివీడులో పట్టపగలే వైసీపీ నేతపై కత్తులతో దాడి చేశారు.ఇళ్లలోకి చొరబడి కత్తులు చూపిస్తూ వైసీపీ కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేశారు.ఇలా ఏపీలో వరుసగా జరుగుతున్న ఘటనలపై వైఎస్సార్‌సీపీ నేతలు గురువారం సాయంత్రమే గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసి వివరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన్ని కోరారు. అయినా టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు.

గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా టీడీపీ శ్రేణుల్లో మార్పు రాలేదు.పుంగనూరులో వైసీపీ కార్యకర్తపై రెచ్చిపోయారు. వెంటపడి మరీ వేదిస్తూన్నారు. ఇక నెల్లూరులో జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు విక్రమ సింహపురి యూనివర్సిటీ పై గడ్డపారలతో దాడి చేసి శిలాఫలకాలను ధ్వంసం చేశారు.రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరిట నిర్మించిన సెంట్రల్ లైబ్రరీ ను వైస్ ఛాన్సలర్ ఆచార్య సుందరవల్లి ప్రారంభించి ఆవిష్కరించిన శిలాఫలకాలను గడ్డపారలతో పగలకొట్టారు.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో వెయ్యి ఏనుగుల బలంతో టిడిపి నేతలు కార్యకర్తలు గడ్డపారలతో శిలాఫలకాలను పగలగొట్టే స్థాయిలో ముందుకు పోతున్నారు.తెలుగుదేశం పార్టీ నేతలు వస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దూరంగా దాక్కోవలసిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గవర్నరు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version