నేడు తెలంగాణా కేబినేట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. అదే విధంగా సచివాలయ కూల్చివేతతో పాటుగా కొత్త సచివాలయ నిర్మాణం గురించి చర్చ జరుగుతుంది. ఖరీఫ్ వ్యవసాయం గురించి కూడా చర్చ జరుగుతుంది. కొత్త సెక్రటేరియట్ డిజైన్ కు ఆమోద ముద్ర వేయనుంది తెలంగాణా కేబినేట్.
నియంత్రిత వ్యవసాయ విధానం అమలు పై సమీక్ష జరగనుంది. వ్యవసాయ శాఖ అధికారుల నుంచి పలు వివరాలను సిఎం కేసీఆర్ తెలుసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చ జరగనుంది. కరోనా నేపథ్యంలో విద్య రంగం పై చర్చ జరగనుంది. స్కూల్స్ ఓపెనింగ్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆయుష్ డాక్టర్ ల వయోపరిమితి పెంపు ఆర్డినెన్స్ కి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ తో జల వివాదాలు అపెక్స్ కౌన్సిల్ అంశాలు చర్చ కు వచ్చే అవకాశం ఉంది.