లెక్క తేలింది…ఏపీలో పోలింగ్ శాతం ఇదే…ఎవరికి మెజారిటీ అంటే…?

-

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఆసక్తికరంగా ముగిశాయి.ఇక ఈ ఎన్నికల్లో ఎవరికి మెజారిటీ ఓట్లు పడుంటాయి అనే అంశంపై జనాల్లో విపరీతంగా చర్చ నడుస్తోంది.ఇక సీఎం ఎవరా అంటూ తెగ మాట్లాడేసుకుంటున్నారు. మావాడు అంటే మావాడు అంటూ ఎవరికి వారు సీఎంని డిసైడ్ చేసేస్తున్నారు.ఈ ఎన్నికల్లో ప్రధానంగా కొన్ని జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేదానిపై గెలుపోటములు ఆధారపడి ఉంటాయనే చర్చ ఎంతో ఆసక్తికరంగా జరుగుతోంది.ఇదిలా ఉండగా ఏపీలో పోలింగ్ శాతాన్ని చెప్పేసింది ఎన్నికల సంఘం.ఈ సారి 80.66 శాతం పోలింగ్‌ నమోదయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ 1.07 శాతాన్ని కలిపితే మొత్తం పోలింగ్‌ 81.73 శాతంగా ఉండొచ్చని అధికారులు వెల్లడించారు.

గతంతో పోలిస్తే ఈసారి కాస్త పోలింగ్ శాతం కాస్త పెరిగింది.దీంతో ఎవరికి మెజారిటీ సీట్లు వస్తాయా అని నేతలు చర్చించుకుంటున్నారు.అయితే ఎప్పటిలాగే వైసీపీ ఈసారి కూడా అధికారం తమదే అంటూ ధీమాగా ఉన్నారు. మహిళలు ఎక్కువశాతం ఓట్లు వేయడంతో సీఎం జగన్ కి బ్రహ్మరథం పట్టారని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో శ్రీకాకుళం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో వైసీపీకి ఎక్కువ ఓట్లు పోల్ అయినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళంలో మాత్రం టీడీపీకి కొంచెం అనుకూల పవనాలు వీచాయని తేలింది.ప్రధానంగా విశాఖ, విజయనగరం, గోదావరి జిల్లాలో వైసీపీ మంచి స్కోర్ చేసినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఇంకా ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ప్రధానంగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ దాదాపు వార్ వన్ సైడ్ అన్నట్లుగా కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఉంది.

కొన్ని కీలక నియోజకవర్గాల్లో అయితే ఇంతకాలం అక్కడ బలంగా ఉన్న టీడీపీ అభ్యర్థులకు సైతం ఖచ్చితంగా షాక్ లు తప్పకపోవచ్చనే కామెంట్లూ బలంగా వినిపిస్తున్నాయి.కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల ఓటర్ల అభిప్రాయం కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది. దీంతో ఇప్పుడు ఏపీలో అధికారంలోకి ఖచ్చితంగా మరోసారి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అంచనా వేస్తున్నారు.ఈ ఎన్నికలలో పురుషుల కంటే మహిళలు ఎంతో ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్న పరిస్థితి కనిపించింది.ఎందుకంటే మహిళలకు సీఎం వైఎస్ జగన్ కల్పించిన సాధికారతకు ప్రతి రూపమే ఈ పోలింగ్ అంటున్నారు.అమ్మ ఒడి, ఆసరా, ఇళ్ల పట్టాలు, చేయూత లాంటివి మహిళలకే అందించడం వల్ల వైసీపీకి ఓట్లు బాగా పడ్డాయని అంటున్నారు.మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషిచేయడం వల్ల నేడు అన్నిచోట్లా జనాల నుంచి వైసీపీకి సానుకూల స్పందన వస్తోంది.అటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కూడా మేలు చేసిన వైఎస్ జగన్ ను మరోసారి సీఎంగా చూడాలనుకుంటున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version