పోలీసుల ‘ప్రేక్షక పాత్ర’ చూడండి..డీజీపీ గారు అంటూ ఫైర్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిన్న అచ్చంపేట పట్టణంలో కాంగ్రేసు గూండాల దాడిలో స్థానిక పోలీసుల ‘ప్రేక్షక పాత్ర’ చూడండి DGP గారు. ఆగంతకులు యధేచ్చగా హత్యాయత్నం చేస్తుంటే పోలీసు అధికారి టాబ్లెట్ (electronic gadget) పట్టుకొని చోద్యం చూస్తున్నారు! అని మండిపడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే? ఇప్పుడే DSP గారితో మాట్లాడితే నిందితులు ఇంకా పరారీలో ఉన్నారని చెబుతున్నారు. ఆ ఇద్దరు పోలీసు ఆఫీసర్లు కనీసం ఒక్క నిందితున్ని కూడా పీఎస్ కు తీసుకరాలేకపోయారు!!! వాళ్ల మీద చర్య తీసుకోండి. ఈ దాడి జరుగుతుందని పోలీసులకు ముందరనే తెలువదా??? ఇప్పుడైనా స్థానిక ఎమ్మెల్యేను తీసుకొచ్చి పోలీసు స్టేషన్లో ప్రశ్నించండి..నిందితులు రెండు నిముషాల్లో దొరుకుతారు అంటూ ఆగ్రహించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.