కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ రోజు కాంగ్రెస్ ఆందోళన చేయనుంది. కిసాన్ విజయ్ దివాస్ పేరు తో నేడు దేశ వ్యాప్తంగా ర్యాలీ లు తీయనుంది. అలాగే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన లు చేసిన రైతులకు కూడా ర్యాలీ ద్వారా తమ మద్దతు తెలపాలని నిర్ణయం తీసుకుంది. రైతుల నిరంతర పోరాటం వల్లే సాగు చట్టాలు రద్దు అయ్యాయని ఏఐసీసీ తెలిపింది.
అలాగే ఈ కిసాన్ విజయ్ దివాస్ ర్యాలీ లను అన్ని రాష్ట్రాలలో నిర్వహించాలని ఏఐసీసీ కమిటీ అన్ని రాష్ట్రాల కమిటీ లను ఆదేశించింది. కాగ ఈ కిసాన్ విజయ్ దివాస్ ర్యాలీ లో అన్ని రాష్ట్రా ల లో అధిక సంఖ్య లో రైతులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. కాగ శుక్ర వారం రోజున ప్రధాన మంత్రి మూడు సాగు చట్టాలను రద్దు చేస్తు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.